పుట:Andrulasangikach025988mbp.pdf/268

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆనాటినుండి నిన్న మొన్నటివరకు కూచిపూడివారు భరతాభినయాన్ని కాపాడి దేశమందు ప్రచారము చేసినట్టివారు. "కడిపోని తెరనాటకపుటూరి జంగాలు" (వేంకటనాథపంచ 4-240) అనుటచే ఊరి జంగాలు కృష్ణా గోదావరి జిల్లాలలో నాటకాలాడెడి వారని తలపవచ్చును.

ఆంధ్రభాష సంగీతానికి అత్యంతానుకూల మైనట్టిది. దక్షిణాపథమందంతటను, కన్యాకుమారి నుండి కటకం వరకును ఇతర ద్రావిడ భాషలవారు తెనుగుపాటలనే యెక్కువగా పాడుదురు. విజయనగర రాజులు కన్నడ రాజ్యమున కధీశులగుటచేత సంగీతముకూడా కర్ణాట సంగీతమయ్యెను. నిజముగా ఆంధ్ర సంగీతమని దానికి పేరుండెను. ఆంధ్రరాజులు సంగీత విద్యయందు ప్రత్యేక కృషిచేసిరి. తంజావూరి రఘునాథరాయలు రఘునాథమేళ యను క్రొత్తవీణను సృష్టించెను. పూర్వము ఒక రాగమునకు ఆంధ్రీరాగము అను పేరుండెను. అనగా గాంధార దేశము గానమున కెట్లు ప్రసిద్ధివహించెనో ఆంధ్రదేశ మిట్లు మరొక విధమగు (కర్ణాట సంగీతము) గానమునకు ప్రసిద్ధి వహించెనన్నమాట.

         "విబావినీతు పౌరాళీ వేగవంతీతు పంచమా
          ఆంధ్రీ గాంధారికా చైవ సత్స్యుర్మాలవపంచమా".

తెనుగు సంగీత విద్వాంసులు హిందూస్థానములో పరరాజులను, ముసల్మానులను మెప్పించిరి. విఠలుడు అనునతడు సంగీత రత్నాకరభాష్యము వ్రాసెను. అతని తండ్రి 22 రాగశ్రుతులలో ప్రవీణు డగుటచే గుజరాతులోని మాండ్వీసుల్తాను అను గయాసుద్దీన్ మహమ్మద్ 1000 తులాల బంగారు నిచ్చి బహుకరించెను.[1] ఆ కాలపు తెలుగు వాఙ్మయములో గొండ్లి నృత్యమునుగూర్చి పలుమారు వ్రాసినారు. శ్రీ మానవల్లి రామకృష్ణకవిగా రిట్లు వ్రాసినారు. "జాయ సేనాని తన నృత్త రత్నావళిలో-చాళుక్య భూలోక మల్లసోమేశ్వరుడు దానిని ప్రచారము చేసె"నని తెలిపి యీ క్రింది ప్రమాణము నిచ్చెను.

          "కల్యాణకటికే పూర్వం భూతమాతృ మహోత్సవే
           సోమేశ; కుతుకీ కాంచిత్ భిల్లవేష ముపేయుషిం
           నృత్యంతీ మథ గాయంతీం స్వయం ప్రేక్ష్య మనోహరం

  1. శ్రీ మానవల్లి రామకృష్ణకవిగారు.Journal of Andhra H; R. Vol. Xj. P. 174.