పుట:Andrulasangikach025988mbp.pdf/265

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

          సర్శ్యశృంగులు దాశనళినేక్షణా పరా
            శరులు తారానిశాకరులు గౌత
          మాంగనాదేవేందు లమర వేశ్యాజయం
            తులు ద్రౌపదీ పాండవులు పృథాబ్జ
          హితులు నడచినగతు లాత్మ సుతలనుంచు
            నింటిగోడల వ్రాయించునిందువదన.[1]

అంతేకాదు:-

         "వనిత చతుర్జాతి వయో వనజాక్షుల
            బంధవైభవము భద్రుని, ద
         త్తుని గూచిమారు, పాంచాలుని వ్రాయించెన్
            గృహంబు లోపలిగోడన్" [2]

"కూచిమార మనోజ ఘోణికా పుత్రాదికానీత కామ సిద్ధాంతములను." ఇంకను విట్టి వనేకములను బిడ్డలకు నేర్పించెను. [3]

విజయనగర చక్రవర్తులలో కృష్ణదేవరాయలే ఉత్తమ శిల్పములతో కూడిన దేవాలయములను నిర్మింపజేసెను. హజార రామాలయము విఠలాలయము చాలా సుందరములయినవని శిల్పవేత్తలు పొగడినారు. కృష్ణరాయల సభాభవనమును భువన విజయము అనిరి.

          "భువన విజయాఖ్య సంపన్నవరత్న విభాప్రభాత నలినాప్తరమా
           ధవ చరణకమల సేవా ప్రవణమతీ వీరరుద్ర పర్వతవజ్ర్"[4]

అతడు నివసించు సౌధమునకు మలయకూటము అని పేరుండెను. "మలయకూట ప్రాసాదనివేశ కృష్ణరాయమహీశా!"[5] భువనవిజయమం దతిసుందర శిల్పములు నిండుగా నుండెను. కోతులు, రాయబారులు, రాణీలు

  1. శ్రీ కాళహస్తి మహాత్మ్యము, 4వ ఆశ్వాసము 14.
  2. శ్రీ కాళహస్తి మాహాత్మ్యము, 4-18.
  3. శ్రీ కాళహస్తీ మాహాత్మ్యము, 4-16.
  4. పారిజాతాపహరణము.
  5. పారిజాతాపహరణము. 5-108.