పుట:Andrulasangikach025988mbp.pdf/264

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నేర్పూది... ....శాస్త్రసరణిన్ తూలిన్ హరిన్ వ్రాసి[1] అని రాయలు తెలిపెను. పసిడి గచ్చమర సోపానముల్ మూట దుంగిత విశాలితయు చిత్రితయు నైనసభ [2] అనియు తెలిపెను. ఇచట గచ్చుముచ్చట కలదు. ఆ గచ్చు చాల గట్టిదిగా నుండుటకై సన్ననియిసుకలో బెల్లమునీరు, చమురు, సున్నము కలిపి గానుగబట్టి సిద్ధముచేయుచుండిరి.[3] ఇంత మాత్రము కవితలో ప్రతిబింబించినది. కాని ఆ గచ్చులో గోందు, కరక్కాయ, బెండకాయలు, అమృతవల్లి (పాచీతీగ) ఆకురసము, తుమ్మచెక్కకూడా కల్పుతుండిరి. అట్టి గచ్చు కలకాలముండెడిది. భవనాలలో నెట్టి చిత్తరువులు వ్రాయించిరో అనియు మనకు తెలియవచ్చినవి.

           "ఆదినారాయణు డమృతాబ్ధి మథియించి
              యబ్జవాసిని పెండ్లియైన కథలు
            చంద్రశేఖరుడు పుష్పశరాసను గెల్చి
              హిమాచలతనయ బెండ్లయిన కథలు
            శ్రీరామచంద్రుడు శివధనుర్భంజన
              మడరించి సీత బెండ్లయిన కథలు
            నలచక్రవర్తి వేల్పులు సిగ్గువడగ
              భీమాధీశకన్య బెండ్లయిన కథలు
            చిత్తభవ కేళి బంధ విచిత్రగతులు
              హంస కలరవ కీర రథాంగగతులు
            వ్రాసి రలవడ తత్స్వయంవర మహా
              స్థలాంతికి స్వర్ణసౌధ కుడ్యముల నెల్ల." [4]

బోగముసానులయిండ్ల చిత్రములు వారికి తగినట్టివే !

           "రతివధూమదనుల రంభాకుబేర
              పుత్రకు లూర్వశీపురూరవులు మేన
            కాకౌశికులు గోపికాముకుందులు
              ధాన్య మాలినీరావణుల్ మత్స్యలోచ

  1. అము. 5-149.
  2. అము. 4-58.
  3. మను. 5-38.
  4. రాధామాధవం, 1-188.