పుట:Andrulasangikach025988mbp.pdf/266

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నృత్యము చూచుట, వేటలు, స్త్రీల ప్రసాధనక్రియలు నర్తకీలు, బందీలు మున్నగున వుండెను. అనగా ఆ కాలపు సాంఘిక చరిత్ర విజయనగర శిల్పములందు పూర్తిగా ప్రతిబింబిత మయ్యెను. ఆ నగర విధ్వంసమువలన మన చరిత్రకు చెప్పరాని అపార నష్టము కలిగినది. రాజసౌధముఖశాల (మోసాల)పై ఘటికాయంత్ర ముండెను. ఘడియ కొకసారి గంటలు లెక్కప్రకారము కొట్టుతూ వుండిరి.

"... ఘటికావర్యాప్తి ఘంటారవాం, తరనిర్ణీతములై వినంగ బడియన్ మధ్యాహ్న శంఖధ్వనుల్."

అని రాయలే తెలిపినాడు.

కృష్ణరాయలు సాహిత్యమందేగాక సంగీతమందును మంచి ప్రావీణ్యత కలవాడు. విజయనగర చక్రవర్తుల కాలమందేబహుశా తెనుగులో పాడినను, అరవములో పాడినను దాక్షిణాత్యసంగీతమునకు కర్ణాటసంగీతమను పేరుకలిగెను. "కృష్ణ" అను పేరుగల విద్వాంసుడు రాయలవారికి సంగీతము నేర్పెను. అతడు రాయలకు వీణావాద్యముకూడా నేర్పినందులకుశిష్యుడు గురువునకు గురుదక్షిణముగా నిలువైన ముత్యాల హారాలను, వజ్రాల హారాలను నిచ్చెనని కర్ణాటభాషలో నారాయణ కవిచే వ్రాయబడిన రాఘవేంద్రవిజయములో తెలిపినారు( [1]) సంగీతము శాస్త్రప్రకారము అత్యంతాభివృద్ధి నొందెను. ఒక్కొక్క ఋతువులో ఒక్కొక్క రాగమునకు ప్రాధాన్యముండెను. వసంతకాలమందు హిందోళరాగము పాడిరి.([2]) రాయలకు పోర్చుగీసు రాయభారి తమ దేశపు వాద్యములను కానుక యివ్వగా వారు చాల సంతోషించిరట! క్రీ.శ. 1514 లో బార్బోసా యిట్లు వ్రాసెను. "ప్రతి దినము స్త్రీలు రాయలవారికి కడవల కొలది నీళ్ళతో స్నానము చేయించి పాటలు పాడుదురు." చక్రవర్తి సభ చేసినప్పుడు గానము చేసెడివారు. ఆనాటి శిలాశిల్పములలో నృత్యములు, వాద్యములు, కోలాటము, కాహళలు మున్నగునవి బహువిధముల నిరూపింపబడినవి. బోగముసానులు సంగీతవిద్యలో ప్రత్యేక కృషిచేసిరి. అంతేకాక నృత్య విద్యను తమ పిల్లలకు 10 ఏండ్లకు ముందునుండియే నేర్పరి. తమ పిల్లలకు 10 ఏండ్లు పడువరకే "దేవదాసీలను"గా చేసెడివారు. వ్యభిచార వృత్తిలోని వారగుటచే వారికి

  1. Salatore, Vol. II
  2. ఆముక్తమాల్యద 5-118.