పుట:Andrulasangikach025988mbp.pdf/259

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తర్వాతి కాలమువాడగు తెనాలి రామకృష్ణుడు తన పాండురంగ మాహాత్మ్యములో ఈ సిడినిగురించి వర్ణించెను. ఇది రెడ్లలోనే యెక్కువగా నుండినట్లు తెలిపినాడు.

          "అంభోధరముక్రింద నసియాడు, నైరావ
           తియుబోలె సిడివ్రేలె తెరవయోర్తు"

అన్నాడు. (ఈ కవి రాయలతర్వాతి వానినిగా పరిగణించినందు ముందు ప్రకరణములో చర్చింతును.) ఈ సిడియాట నేడు లేదు. 400 ఏండ్లలోనే యింత మార్పు!

కోలాటమందు జనుల కాసక్తి యెక్కువగానుండెను. రాయలసీమలో నేటికిని వెన్నెలరాత్రులందు జనుల కది ప్రాముఖ్యమైనది. కోడి పందెములు చాలా విరివిగా నుండెనని పీస్ వ్రాసెను. అదొక్కటే కాదు. దున్నపోతుల యుద్ధాలు, డేగవేటలు, పాచికలాటలు, జనులకు ప్రీతి పాత్రమని పీస్ వ్రాసెను. "కాసె కట్టుటయు కత్తిదాల్చుటయు, కృకవాకుల కలహంబులంద" అని రాయలు వర్ణించెను.([1])

చతురంగపు ఆట చక్రవర్తులనుండి సాధారణజనులవరకు ఆసక్తిని కలిగించినట్టిది. దీనిని మోసిన్ పుట్టకముందే హిందువులు కనిపెట్టిరని ప్రతీతి నౌషీర్వాన్ అను ప్రసిద్ధ పారసీకచక్రవర్తి యీ యాట గొప్పదనమును విని హిందూస్థానమునుండి అదేపనిగా చతురంగపు పలకలను, కాయలను తెప్పించుకొని ఆ విద్యను నేర్పు గురువును పిలిపించుకొనెను. బాణు డీ యాటను వర్ణిం

  1. ఆము 4-187.