పుట:Andrulasangikach025988mbp.pdf/258

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆ కాలములోని ఆంధ్రులవినోదాలలో కొన్ని ముఖ్యమైన విప్పు డంతరించి పోయినవి. అందు ముఖ్యమైనది సిడి అనునట్టిది. దానిని కేవలము వినోదమనుటకు వీలులేదు. అది భక్తిప్రధానముగా ఆత్మహింసాత్మకముగా చేయునట్టి ప్రదర్శనము. జనులు మ్రొక్కుబళ్లు చెల్లించుటకై సిడిపై వ్రేలాడుతుండిరి. ఒక పెద్దగడయొక్క కొనయందు ఒకయినుప కొండిని కట్టి అది గడచట్టు తిరుగుటకై ఒక యినుపకడెను గడెకొనయందమర్చి దానికా కొండిని తగిలించెడి వారు. ఆ కొండిని స్త్రీపురుషులు తమ వీపుచర్మములోనో నరాలలోనో క్రుచ్చుకిని దానిపై వ్రేలాడి స్తంభము చుట్టును గిరగిరత్రిప్పబడు చుండెడివారు. దీనిని బార్బోసా చూచి యిట్లు వ్రాసెను. "ఈ దేశములోని (విజయనగర రాజ్యమందలి) స్త్రీలు అతి సాహసిరాండ్రు. తమమ్రొక్కుల చెల్లించుకొనుటలో భయంకరములగు పనులను చేతురు. ఒక యువతి ఒక యువకుని ప్రేమించినచో, ఆమె తన మ్రొక్కు చెల్లినచో సిడిపై వ్రేలాడెడిది. నిర్ణయమైన ఒక దినమున అలంకరింపబడిన యెద్దులబండిపై ఒక మోకును దాని కొక యినుపకొండి యుంచి తీసుకొనిపోదురు. మంగళవాద్యములతో ఆమె బయలుదేరును. ఆమె నడుమునకు మాత్రము బట్ట కట్టుకొనును. సిడిస్తంభమువద్దకు వెళ్ళి యినుపకొండిని ఆమె వీపుచర్మములోనికి గ్రుచ్చి సిడిపై కెత్తెదురు. ఆమె యెడమ చేతిలో చిన్న బాకుండును. గిరకను స్తంభానికి తగిలించి ఆమెను దానిపైకి లాగుదురు. ఆమె గాలిలో కొండిపై వ్రేలాడును. రక్తము కాళ్ళపొడవునను కారినను ఏ మాత్రమున్నూ తాపమును ప్రకటింపదు. పైగా కూతలు పెట్టుచు కత్తి త్రిప్పుచు నిమ్మకాయలతో తనప్రియుని కొట్టుతుండును. కొంత సేపటికి ఆమెను దింపి గాయమునకు కట్టు కట్టుదురు. ఆమె దేవళమున కందరి లోపాటు నడిచి బ్రాహ్మణులకు దానాలు చేయును."

సిడిని సిడిమ్రాను అనియు నందురు. దాని నిట్లు వర్ణించినారు. ఒక స్తంభమును పాతి దానికొనను ఒక గుండ్రని రాతిలో రంధ్రముచేసి తగిలింతురు. దానిపై సన్నని దూలమును పెట్టుదురు. ఆ దూలమును గుండ్రముగా త్రిప్పుదురు. దానికే గిరకతోటి కొండిని తగిలింతురు. ఆ కొండిపై మనిషి వ్రేలాడును. [1] కృష్ణదేవరాయల అష్టదిగ్గజాలలో నొకడని ప్రతీతియేకాని,

  1. salatore. (1