పుట:Andrulasangikach025988mbp.pdf/243

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

"రాజు ఒక తడవ ధరించిన యుడుపుల మరల దరింపడు. చాలాసన్నని జరీ పట్టుబట్టలనే అతడు ధరించెను. వారి టోపీని కులాయి యందురు." రాయల విగ్రహమున్ను, ఆతని యిరువురు భార్యల విగ్రహాలున్న తిరుపతిలో కలవు. రాయల విగ్రహమునకు తలపై తుర్కీ కుచ్చుటోపీ కలదు. అళియరామరాజును, ఆతని సైనికులును యుద్ధమునకు వెళ్ళినప్పుడు వ్రాసిన చిత్తరువులలో మూరెడు పొడవుగల టోపీలు వారు ధరించినట్లు చింతించినారు. ఈ టోపీల యాచారము కర్ణాటకులలో నుండెనేమో? తురకలలో ఆనాడీవేషము లేకుండెను. వారి చిత్తరువులలో నిట్టివి కానరావు. తెనుగుసీమలోను నిట్టివి లేకుండెను. శ్రీనాథుడు ప్రౌడ దేవరాయల ఆస్థానానికి పోయినప్పుడు కర్ణాట దర్బారు వేషము వేసికోవలసి వచ్చెను. కుళ్ళాయి పెట్టుకొని మోకాళ్ళ క్రిందికి జారిన మహా కూర్పాసమును అంగీని తొడిగి పెద్దసెల్లా వేసుకొనెను. అయితే కులాహ్ అనుశబ్దము ఫార్సీలో టోపీ యను నర్థమగుటచే ముసల్మానుల నుండియే విజయనగర రాజులు వారి అనుయాయు లీ యాచారమును స్వీకరించిరేమో? ఆనాటి కర్ణాటాచారమును నేటికిని కొందరు వైష్ణవ భిక్షుక భక్తులు అక్షయ పాత్రతో బయలుదేరి పొడవు టోపీలను ధరించి రామదాసు కీర్తనలను పాడుచుందురు.

జనుల వేష భూషణములను గురించి అబ్దుర్రజా కిట్లు వ్రాసెను. 'ఈ దేశమందు ధనికులును - చెవులపోగులను, కంఠహారాలను, దండకడెములను, ఉంగరాలను ధరింతురు'[1] నికోలోడీ కాంటి అను యూరోపు వాసి యిట్లు వ్రాసెను. 'జనులు గడ్డాలు పెంచరు. కాని జుట్లుపెంచి కొప్పు ముడి వేయుదురు. యూరోపువాసులవలె జనులు ఎత్తై అయురారోగ్యాలు కలిగి యున్నారు. పట్టె జముఖాణాలపై జరీ అంచు ఛాదర్లను పరుచుకొని పండుకొందురు. కొందరు స్త్రీలు సన్నని అట్టలుకల మోజాలను జరీపనులతో అలంకరించి తొడిగి కొందురు.'

బార్బోసా అను మరొక పాశ్చాత్యు డిట్లు వ్రాసెను. 'పురుషులు చిన్ని రుమాళ్ళను కట్టుదురు. లేదా పట్టుటోపీలను పెట్టుకొందురు. కిర్రు చప్పులను తొడుగుకొందురు. శరీరమునకు రుద్దుకొనుటకై వాడుకొను నలుగు పిండిలో గంధముపొడి, కుంకుమపువ్వు, కర్పూరము, కస్తూరి, కలబంద కలిపి నూరి పన్నీటితో మర్దనచేసి రుద్దుకొందురు.[2] విజయనగర వాసులు తురకలవలె

  1. Salators, II.
  2. Salators, II.