పుట:Andrulasangikach025988mbp.pdf/244

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చల్లడములను తొడుగు కొందురు. చల్లడమును 'చండాతకము' అనిరి[1] జనుల టోపీలు రెండు విధములైనవి. ఒకటి రెండు జానల పొడవైనదని తెలిపినాము. రెండవది బొందెలు కల బట్ట కుల్లాయి. అది నెత్తికి నిండుగాను, చెవులు, చెంపలు మూయునదిగానుండి గొంతు క్రింద బొందెలతో కట్టబడుతూ వుండెను. అది 'గౌదకట్టుకసి చేరుల టెక్కి'[2] అనగా చెంపలు మూతబడునట్లుగా కొరడా కొనవలె నుండు బొందెలతో గడ్డముక్రింద ముడివేయు కుళ్ళాయి యనియర్థము.

దొరలు తమ అధికారుల పనుల మెచ్చుకొన్నప్పుడు వారికి కొత్త వస్త్రములు, అంగీలు, టోపీ పసదనముగా నిచ్చెడివారు; 'మేలు కుళ్ళాయి గబ్బాయి కొమ్మంచు నొసగి'[3] అని వర్ణించిరి. గబ్బాయి అనవలెనో, కబ్బాయి అనవలెనో తెలియదు. కొందరు కవులు అంగీ అను నర్థములో 'కబాయీ' అని వాడినందున ఇచ్చట కబ్బాయి యనవలెను. కుల్లాయివలె ఇదియు విదేశిపదమో యేమో ? ఈ పదమును అ కాలపు పింగళి సూరన వాడెను. అంతకు పూర్వకవితలలో ఇది కానరాదు.

జనుల వాహనములు చక్రపుబండ్లు, ఎద్దులు, గుర్రాలు, అంథలములు, పల్లకీలు అయియుండెను. "పల్లకీలు, నందలములు, వారువంబులును, దంతులు నాదిగ గల్గు వాహనంబులు"[4] అనుటలో పల్లకీలు, అందలములు అని రెండును కలిపి చెప్పినందున వాటిలో భేద మున్నదనుట స్పష్టము. అందులము లనగా ఇప్పుడు పీఠాధిపతులను ఉత్సవ విగ్రహాలను తీసికొనిపోవునట్టి దాపులేని వాహనములు. పల్లకి యనగా ప్రక్కలందును పైభాగమందును మూతల కప్పును గల 'మ్యానా'. ధనికులు ఉయ్యెలమంచాలు, దోమ తెరలమంచాలు, చక్కని శిల్పములతో కూడినవాటిని వాడిరి.

          'బంగారు గొలుసులు పవడంపు దరిమెన
               కోళ్ళును వింతబాగుల బొగడలు
           రత్నంపు చిలుకలు రాయంచ ప్రతిమలు
               పసిడి పువ్వుల వ్రాతపనుల సోబగు

  1. ఆముక్తమాల్యద, 4 - 35.
  2. ఆముక్తమాల్యద 7 - 17.
  3. ప. యో. విలాసము. పు 482.
  4. కళాపూర్ణోదయము 2 - 7.