పుట:Andrulasangikach025988mbp.pdf/200

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పెద్ద గుర్రమును 300 నుండి 600 డకెట్ల వర కమ్మిరి. (దా డకెట్ = 5 రూపాయలు). చక్రవర్తి యెక్కు గుర్రము వెల 1000 డకెట్లు.[1]

విజయనగర సైన్యములో 40,000 గుర్రాలుండెను. కాల్బలము కత్తులు, బల్లెములు పట్టుచుండెను. మొత్తము 10 లక్షలసేన యుండెను.

విన్సెంటు స్మిత్ తన ఆక్సుఫర్డ్ హిందూదేశ చరిత్రలో ఇట్లు వ్రాసెను. "1520 లో కృష్ణదేవరాయలు రాయచూరు యుద్ధమునకు ఏడులక్షల మూడువేల కాల్బలమును, 32,600 గుర్రపుసేనను, 551 ఏనుగులను తీసుకొని పోయెననియు, ఆ సైన్యము వెంట సైనులు, నౌకరులు, వ్యాపారులు మున్నగువారు కొల్లలు కొల్లలుగా పోయిరనియు వీన్ వ్రాసెను. రాయలకన్న చాలా కాలమునకు ముందే రథాలు సైన్యమునుండి తొలగిపోయి యుండెను. రాయల బలమునకు సంఖ్యాబలమే ప్రధానము కాని, సైనికులు ముసల్మానుయోధులకు భయ పడెడివారు. సైనికులు పలువురు వ్యక్తిగతముగా శూరులే, బలాడ్యులేకాని సైనిక వ్యూహములో వారు పనికిరాని వారైరి.

"ద్వంద్వయుద్ధము కేవలము విజయనగర రాజ్యమందే నెగడెను. ద్వంద్వయుద్ధము చేయువారు మంత్రి లేక రాజు సెలవు పొందవలసి యుండెను. గెలిచినవానికి ఓడినవాని ఆస్తి యిప్పించెడివారు." (సింహాసన ద్వాత్రింశికోదాహృత వర్ణన యంతయు సత్యమేయని పైవాక్యాలు నిరూపించినవి).

పీస్ అను విదేశి ఇట్లు వ్రాసెను: "సైనికులు నానావిధములగు రంగురంగుల బట్టలను తొడుగుతూ వుండిరి. అవి చాలా విలువగలవై యుండెను. వారు పట్టు డాళ్ళపై బంగారుపూలను, పులులను, సింహాలను చిత్రింప జేస్తుండిరి. ఆ డాలులు అద్దాలవలె మెరుస్తూ వుండెను. వారు పట్టు కత్తుల మీదకూడా బంగారు నీరుపని యుండెను. ధనుర్యుద్ధముచేయు దళముకూడా సైన్యమందుండెను. అమ్ముల మీదకూడా బంగారు పనితన ముండెను. భాణాలకు ఈకలు కట్టువారు, నడుములో కాసెదట్టీ; ఆ దట్టీలో బాకులు, గండ్రగొడ్డండ్లు చెరివియుండిరి. జానకి త్రాటి

  1. SALATORES _ Social and Political Life in Vijiayanagar Empire, Vol, II. ఇక ముందీ గ్రంథాన్ని Salatore అని యుదాహరింతును.