పుట:Andrulasangikach025988mbp.pdf/201

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తుపాకీదళ మొకటి యుండెను.[1] అటవికులగు చెంచులు , కోయలుమున్నగు వారినికూడా సేనలో చేర్చుకొనిరి."[2]

కాల్బలమువారు ప్రాణాలను లెక్క పెట్టేవారు కారు. వారు చెడ్డీతప్ప మరేమియుకట్టుకొనక శరీరమంతయు నూనె పూసుకొని యుద్ధములో దిగెడివారు. శత్రువులతో పెనగినప్పుడు వారికి చిక్కక జారి పోవుటకై వారీతంత్రమును పన్నినవారు. గరుడ, గరుడా అని సైనికులు యుద్ధ కేరలు వేసెడివారు.

గుర్రాలను బాగా అలంకరిస్తుండిరి. వాటితలపై వెండి బంగారు పట్టీలను కట్టిరి. గుర్రపురౌతులు పట్టుబట్టలను దొడుగుతూవుండిరి. 10,000 ఏనుగుబ సైన్యముండెను. ఏనుగులకు రంగులువేసి అలంకరించిరి. ప్రతి ఏనుగుపై నలుగురు కూర్చొనుటకై అంబారి కట్టిరి. సైన్యావసరములగు వస్తువులను ఎద్దులు, కంచరగాడిదలు, గాడిదలు మోయుచుండెను.[3]

యుద్ధములో నుపయోగించు ఆయుధముల ముచ్చట ఆ కాలపు వాఙ్మయములో అందందు వర్ణింపబడినది. కుమార ధూర్జటి తన కృష్ణరాయ విజయములో కృష్ణరాయల జైత్రయాత్ర నిట్లు వర్ణించెను.

         సీ. రటిత దిక్తట నట త్పెట పెటార్బటులతో
                 ఘోరమైన తుపాకిగుండ్లచేత
            దవ్వుదవ్వున హెచ్చి రివ్వురివ్వున వచ్చి
                 పసరించు రాచూరి బాణములను
            పెల్లుగావేసి చిత్తజల్లుగా వెదజల్లు
                 పెంపరుల్ పెంపారు నంపగముల
            ధాటీగతి నటింప మాటికి సూటిగా
                 నాటుకొన్ బల్లెంపు టీటేగముల

  1. Salatore, II.
  2. "పార్వతీయ బలంబులోనం గూడకయ రాజునకు ప్రజాబాధ తరుగదు" ఆముక్తమాల్యద. 4 - 222. అట్లే 223, 224, 225 కూడా చదువుకోవలెను.
  3. Salatore, II.