పుట:Andrulasangikach025988mbp.pdf/158

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

        అచ్చలవణాదికములతోడ అమృతఖండ
        పాండురంభైన దధితోడ, బ్రాహ్మణులకు
        భోజనము పెట్టు ద్వాదశీ పుణ్యవేళ
        లింగమంత్రి నవీనరుక్మాంగదుండు.[1]

(శిఖరషాడబరసము=పండుదానిమ్మ తియ్యనిరసము) ద్విజాతివర్గము వారు ఏకాదశీవ్రతనిష్ఠు లన్నమాట. తన్మాహాత్మ్య ప్రతిపాదితమగు రుక్మాంగద కథ అప్పటికే ప్రచార మందియుండెను.

ఇంకా యెట్టి రుచిర పదార్థముల నారగించి రనగా:-

       "ద్రాక్షాపానక ఖండశర్కరలతో, రంభాఫల శ్రేణితో,
        గోక్షీరంబులతోడ, మండెగలతో, క్రొన్నేతితో, పప్పుతో,
        నక్షయ్యంబగు నేరుబ్రాల కలమాహారంబు నిశ్శంకతన్
        కుక్షుల్ నిండగ నారగించితిమి యక్షుద్రక్షుధా శాంతికిన్[2]

అంతేకాదు. భక్ష్యభోజ్య చోప్య లేహ్య పానీయముల వైవిద్యములను కాశీఖండమం దిట్లు వర్ణించినారు.

"కనక రంభాపలాశ పాత్రంబులయందు విచిత్రంబుగాగల వంటకంబులు, అపూసంబులు, లడ్డువంబులు, ఇడ్డెనలు, కుడుములు, అప్పడంబులు, ఇప్పట్లు, గొల్లెడలు, జిల్లేడుకాయలు, దోసియలు, సేవియులు, అంగరపోలియలు, సారసత్తులు, బొంతర కుడుములు, చక్కిలంబులు, మడుగుబూవులు, మోరుండలు, పుండ్రేక్షుఖండములు, పిండ ఖర్జూర ద్రాక్షా నారికేళ కదళీ పనస జంబూ చూత లికుచ దాడిమీ కపిత్థ కర్కాంధూ ఫలంబులు, గసహసలు, పెసరుం బులుగములు చెఱకు గుడములు, అరిసెలు, బిసకిపలయముల వరుగులు, చిరుగడములు, బడిదెములు బులుపలు, బులివదకలు, పప్పురొట్ట్యలు, చాపట్లు, పాయసంబులు, కర్కరీ కారవేల్ల కూశ్మాండ నిష్పావపటోలికా కోశాలాబూ సిగ్రూ దుంబర వార్తాక బింబికా కరవింద శలాటువులును, కందయుం బొందయు, చారులు, దియ్యగూరలు, పచ్చడులు, బజ్జులు, గిజ్జణులు, వడియంబులు, కడీ

  1. భీమేశ్వర పురాణము, అ 1. ప 61.
  2. భీమేశ్వర పురాణము, అ 2. ప 142.