పుట:Andrulasangikach025988mbp.pdf/159

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యంబులు, గాయంబులు, గంధతోయంబులు, ఉండ్రాలు నానుబాలురును, అనుములు, మినుములు, బుడుకులు, నడుకులు, నిలిమిడియును, చలిమిడియును, ద్రబ్బెడయు, వడయును, నుక్కెరలు, చక్కెరలు, నేతులు, దోనెతొలలు, బిట్టును, గట్టును, దాలతిన్మునంబులను, దోపలు, పూపలు, మోదకంబులును, గుడోదకంబులు ........... వడ్డించిరి.[1]

ఈ భోజ్యపదార్థములలో సగము అర్థము కానివిగా ఉన్నవి. ఇందుకొన్ని వంటలు నేడు పలు పలు ప్రాంతలలో లేవనవచ్చును. ఇవి ఆకాలమందలి ప్రజా జీవిత విశేషములందు ముఖ్యమైనవి. సూక్ష్మముగా తరచి పరిశోధించు కొలది ఇంకనూ పెక్కు విశేషములు తెలియ రాగలవు.

వినోదములు

అటలు పాటలు మున్నగు వినోదములు కాకతీయుల కాలము లోనివే యీకాలమందును కానవస్తున్నవి. అవికాక మరికొన్ని యాకాలములోనివిగా తెలియ వస్తున్నవి.

రాజకుటుంబపు రాచవారు పలువురు దుర్మార్గులై ప్రజల బాధించుట సర్వసాధారణము. ఆ కాలమందును నిట్టివారు కొందరుండి యుందురు. వారిని దృష్టిలో నుంచుకొని మంచన యిట్లు వ్రాసెను.

      సీ. ఎలుక వేటల పేర నేగి పట్టణములో ప్రజల యిండులు కూలద్రవ్య బంపు
         చెలగి డేగలకును తొండల నేయబోయి ద్రాక్షామంటపంబులు గాసి సేయు
         కోడిపోరుల పేర వాడల దిరుగుచు పొడగన్న కడపల బొలియవైచు
         వేటకుక్కల దెచ్చి విడిచి మందులలోని మేకల కుసికొల్పి మెచ్చియార్చు"[2]

జనులాడు జూదములు బహు విధములుగా నుండెను.

      క. సరిలేని యంజి సొగటా లరుదగు జూదంబు నెత్త మచ్చనగండ్లున్
         దిరమగు నోమనగుంటలు సరసతమెయి నాడుచున్న సతులం గనియెన్.[3]

  1. కాశీఖండము - ఈ ఘట్టముతో ఇంకనూ చాలా చాలా తెలిపినారు. అభిలాషులు మూలము చూడగలరు.
  2. కేయూర బాహు చరిత్రము. అ 3. ప 295.
  3. భోజరాజీయము. అ 5. ప 76.