పుట:Andrulasangikach025988mbp.pdf/138

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

         సీ. అష్టభాషల మధురాశు విస్తర చిత్ర
                   కవితలు చెప్పు సత్కవులు మెచ్చ
            అమ్నాయములు నాల్గు అంగంబు లారును
                   అఖిల శాస్త్రంబులు నవగతములు
            నూతన రీతుల ధాతు విభ్రమముల
                   రసములు మెరయు నర్ణకమువాడు
            ఏ పురాణంబుల నేకథ యడిగినం
                   దడబాటు లేక యేర్పడగ జెప్పు
            ఓలినవధానములు వేనవేలు సూపు
            శబ్ద విజ్ఞానినైనను సరకు గొనదు
            గౌతమునినైన దొడరి తర్కమున గెలుచు
            అవధరింపు మీకీరంబు నవనినాథ !

"________ఋగ్యజుస్సామాధర్వణంబులందును, శిక్షాకల్ప జ్యోతిర్నిరుక్త వ్యాకరణ చ్చందంబులందును, మీమాంసాదులగు తత్త్వావబోధనంబులందును, బ్రాహ్మంబు, శైవంబు, పాద్మంబు, వైష్ణవంబు, భాగవతంబు, భవిష్యత్తు నారదీయంబు, మార్కండేయంబు, ఆగ్నేయంబు, బ్రహ్మకైవర్తవంబు, లైంగంబు, వారాహంబు, స్కాందంబు, వామనంబు, గౌతమంబు, గారుడంబు, మాత్స్యంబు, వాయవ్యంబు అను మహాపురాణములయందును, , నారసింహంబు, నారదంబు, శివధర్మంబు, మహేశ్వరంబు, గాలవంబు, మానవంబు, బ్రహ్మాండంబు, వారుణ కాళికంబును, సాంబంబు, సౌరంబు, మారీచంబు, కూర్మంబు, బ్రహ్మ భార్గవ సౌర వైష్ణవంబులు నను నవపురాణములందును - తనకు నత్యంత పరిచయంబు"[1]

పైపురాణాలలో ఎన్ని మూలబడెనో ఎన్ని కొత్తవి సృష్టియయ్యెనో తెలుసుకొనుటకుకూడా వీలుకలుగుతున్నది. పలువురు రాజులు "లక్ష్మీయుత్సవములు" చేస్తూవుండిరి. ఆ సమయాలలో వారు కళావేత్తల కుదారముగా దానాలు చేసిరి.

  1. షోడశకుమార చరిత్రము, అ 6. ప. 13, 16.