పుట:Andhrulacharitramu-part3.pdf/44

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఇనుకుర్తి కోట ముట్టడి

పిమ్మట మఱికొంతకాలమునకు సోదరు లిరువురు విజిగీషులై మహత్తర సేనలతో బోయి యినుకుర్తికోటను మట్టడించిరి. చంద్రవంశాన్వయులైన చాళుక్యరాజులు పెక్కండ్రు కమ్మదొరలను తోడు చేసికొని దుర్గమును సంరక్షింపుచు బహుదినములు ప్రాణములు కాసపడక పోరాడి రణభూమియందొఱుగ వారి సేనలు వెఱచి కాందిశీకములయ్యెనట! క్షత్రియులతోనైన యీ మహాయుద్ధమునందు నూటఇరువదియొకండ్రు రాజులను సంహరించుటం జేసి సోమకులపరశురాముం డను బిరుద మనపోతనాయనికి గలిగెనట! ఈబిరుద మాతనికి గలదని తెలిపెడు శాసనము లనేకము లీయనపోతనాయనిచే లిఖింపబడియున్నవి.

అయ్యనవోలు శాసనములో నిట్లున్నది

"మునిరజని పరశురామ
స్థానే వినియుజ్య వైష్ణవం తేజం
సోమకులపరశురామే
ధరా మత్యపన్న పోతభూపాలే"

వె.వం చరిత్ర అనుబంధము పేజీలు 10-14 "సోమకుల పరశురామే భుజబలభీమేధిభూమిగోపాలే యత్ర చ జాగృతి శాస్తరి జగతాం జాగర్తి నిత్యకళ్యాణమ్."

సింగభూపాలీయము.