పుట:Andhrulacharitramu-part3.pdf/43

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శత్రువులదైన జల్లిపల్లికోటను ముట్టడించెను. చాళుక్యవంశదీపకులైన క్షత్రియు లనేకు లాదుర్గములోనుండి విషజ్వాలలను గ్రక్కుచు నాల్కలను దెఱచికొని వచ్చెడి క్రూరకృష్ణసర్పము లభాతి చనుదెంచెడి యావీరకుమార ద్వయము నెదుర్కొని క్షాత్రతేజము పెంపు జూపుచు బోరాడ దొడంగిరి. ఈ క్షత్రియ వీరవర్గమునకు దోడ్పడుటకై కమ్మనాయకులును, రెడ్డినాయకులును బాహుదర్పమున మెఱయుచు యుద్ధసన్నద్ధులై గారా మొగులూరి దుర్గము సమీపమున చెంజెర్ల భూమి ప్రాంతమున నుభయ పక్షములవారికిని మహాభయంకరమైన యుద్ధము జరిగెను. అప్పు డనపోతనాయనికే జయము కలిగినందున వారలిరువురును శత్రువులను సంహరించి వారి రక్తముతో బితృతర్పణము గావించి పగ దీర్చుకుని కృతార్థ జన్ములైరట[1]!

  1. ఇంతటి పౌరుష కృత్యము గావించినందుల కీవీరశిఖామణిని వంధిమాగధులు "రేచర్ల విక్రమాదిత్య, రేచర్లవార్ధి చంద్రోదయ, గోనమల్లారెడ్డిరణభూతబలిహరణ, మంగళపూడి ఇమ్మడిరెడ్డి రణరంగమర్ధనా, రావువరపు మల్లారెడ్డిభుజాఘట్టన, పోలూరు పోలారెడ్డి రణనిర్ధూమధామ, బండికోటారెడ్డి రణభుక్తిఖడ్గభేతాళ, వినుకొండమారెడ్డిప్రాణావాయుహరణ కరవాల క్రూరసర్ప, కుంట్లూరు మారారెడ్డి కంఠవిదళనఖడ్గభైరవకరవాలదంష్ట్ర, అరసపల్లి గౌరిరెడ్డిబలాటవీదావాగ్నికీలా, కొత్తపల్లి కొండారెడ్డి ప్రాపహరా," అని పొగడినందున, బిరుదకాహళరవమ్ములను మ్రోయించుచు నిజరాజధానియగు రాజగిరిరి విచ్చేసెనంట- వె.వం.చ పే 32 చూడుడు