పుట:Andhrulacharitramu-part3.pdf/45

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తరువాత నితడు భువనగిరి, యోరుగల్లు మొదలగు దుర్గముల నన్నిటిని స్వాధీనము జేసికొని నిజముగా క్షత్రియుల పాలిటికి బరశురాముడై యోరుగల్లు ప్రాంతదేశమున నుండు క్షత్రియుల నెల్లర నురుమాడుచుండెను. ఈక్రూర సంహారమున కనేకక్షత్రియ కుటుంబములవారు వెఱచి వాని రాజ్యమును విడిచిపెట్టి విదేశములకు బోయిరి. ప్రతాపరుద్రుని పుత్రుడుగాని వానిసంతతివారుగాని యేమయిరో వారి యుదంత మావంతయు జరిత్రమునం దెలియరాకున్నది. క్రీ. శ. 1365 వ సంవత్సరమునాటికి నోరుగల్లు, పానుగల్లు, భువనగిరి, మెతుకు, గోటకొండ మొదలగు దుర్గము

___________________________________________________________

ఇనుకుర్తి కోటసమీపమున బోరాడి వీరమరణము నొందిన క్షత్రియ నాయకుల పేర్లీక్రిందిని వెలుగోటివారివంశచరిత్రమునం దుదాహరింపం బడినవి.

కొండ రాఘవరాజు, కొండ్రాజు, జగ్గరాజు, గోవిందరాజు, గోపరాజు, జూటూరు సూరపరాజు, స్వర్ణసేనమరాజు, పీనరాజు, చినరాజు, పెద్దిరాజు, అప్పలగోలరాజు, రామరాజు, సాళ్వ రాఘవరాజు, సర్వరాజు, తిరుమలపోల్రాజు, వీరమరాజు, కుప్పరాజు, నరసరాజు, శ్రీనాధ గౌతమీభూనాధరాజు, సంపెట బాల్రాజు, మాదాల పెద్దరాజు, మల్ల దేవరాజు, నట్లూరి పోల్రాజు, నల్లరాజు, శ్రీపతిరాజు, చిన్నవల్లభరాజు, చిననంకిరాజు, కనకరాజు, సక్కట్రాజు, చినలక్క రాజు, చిన్న జీతమరాజు, పాళెం చెన్నరాజు, కట్టావెంకట్రాజు, ఉదయగిరి ఓబళ్రాజు, బాల్దేవళ్రాజు, అకమ్మురాజు.