పుట:Andhrulacharitramu-part3.pdf/35

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బలుమాఱు దలపోసి తపోసి చింతించుచు నిరుత్సాహుడు గాక రెండవ ప్రతాపరుద్రుని పుత్త్రుడు తనకు మిత్రులైన యాంధ్రనాయకులతోడ దురుష్కులను దఱిమివేయుటను గూర్చియాలోచించుచుండెను[1]. ఆంధ్రదేశమున మహమ్మదీయులైన తురుష్కులు తమరాజ్యమును స్థాపిించిరనియు వారలు క్రమముగా దక్షిణహిందూ దేశమునంతయు వశపఱచుకొందురనియు, ఏతన్మూలమున విగ్రహారాధన ద్వేషమతాభిరతులగు తురుష్కులపాలనమున హిందూమతాచార ధర్మములు చెడిపోయి హిందూమతము క్షీణించుననియు, కావున నాంధ్రులు, గర్ణాటులు, ద్రావిడు లేకీభవించి విగ్రహారాధనద్వేషమతాభిరతులు, నూత్నశత్రువులు నగు మహమ్మదీయుల దక్షిణాపథమునుండి తఱిమివేయుట ప్రథమ కర్తవ్యమనియు

  1. ప్రతాపరుద్రుని పుత్త్రుని నిజమైన పేరెద్దియో తెలియరాకున్నది. పల్వురు పలుపేరులను బెట్టి వ్యవహరింపదొడంగిరి. స్థానిక చరిత్రమునందు వీరభద్రరాజని పేర్కొనబడి యుండెను గాని కొందఱు వినాయకదేవుడని వ్యవహరించిరి. ఫెరిస్తా కృష్ణనాయకుడని పేర్కొనియెను గాని చక్రవర్తి పుత్త్రకునికి నాయక శబ్దము చేర్చుట సమంజసముగా గన్పట్టలేదు. మఱియొకచోట నాగదేవుడని వ్యవహరింపబడియెను. భావిపరిశోధనమునంగాని యధార్థనామ మిదియని నిర్ధారింపజాలము.అందువలన నే పేరు గైకొనక నేను ప్రతాపరుద్రునిపుత్త్రుడని మాత్రము వ్రాయుటయె యుక్తమని తోచినది.