పుట:Andhrulacharitramu-part3.pdf/36

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నీమహత్కార్యమును బూనుటకు సంసిద్ధుఁడనై యున్నాననియు, నందుల కెవరిశక్తికొలఁది వారు సైన్యములను బంపి సాహాయ్యము జేయవలసి యుండునని విద్యానగరంబునందుండెడి హరిహరరాయలతోడను, కర్ణాటదేశాధీశ్వరుం డైన బల్లాలదేవునితోడను కేరళదేశాధీశ్వరుని తోడను ప్రసంగించి సఫలీకృత మనోరథుడై క్రీ.శ 1344వ సంవత్సరములో దురుష్కుల నెదుర్కొనుటకు సైన్యముల సమకూర్చుచుండెను. కేరళ దేశాధీశ్వరుండు కొంతసైన్యమును బంపెను. కర్ణాటసైన్యమున కాధిపత్యము వహించిన కంపభూపతియు, రెడ్డినాయకులకు ప్రతినిధిగా వేమారెడ్డి సోదరుడగు మాచారెడ్డి, పద్మనాయక వెలమలకు బ్రతినిధిగా సింగమనాయుడు మొదలగువారును తమలోదమకుంగల వైషమ్యులను గొంత వఱకు మఱచిపోయి యీ మహత్కార్యమునందు ప్రతాపరుద్రుని పుత్త్రునికి దమతమ సైన్యములతో వచ్చి తోడ్పడియుందురు. ఈ సైన్యములకన్నింటికి వీరశిఖామణియు బుద్ధిశాలియునగు ప్రతాపరుద్రుని పుత్త్రుడధ్యక్షుడై సైన్యముల నడిపించుకోనిపోయి యోరుగల్లు ముట్టడించెను. కాకతిసామ్రాజ్యము భగ్నమైన వెనుక నిరువది సంవత్సరములకు ప్రతాపరుద్రుని పుత్త్రుని ప్రయత్నములు ఫలించినవి. అప్పుడు దక్కను నందున్న తురుష్కులకును, హిందువులకును పెక్కుదినములు ముష్కర ఘోర