పుట:Andhrulacharitramu-part3.pdf/34

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

[1]క్రీ.శ 1345 వఱకు బ్రదికి యుండి పేరునకు మాత్రము చక్రవర్తిగానుండి పరిపాలనము చేయుచున్న వాఁడైనను వాస్తవముగా హరిహరాదులే స్వతంత్రపరిపాలనము సేయుచుఁ దమరాజ్యమును బలపఱచుకొని క్రమముగా విస్తరింపఁజేయుచుండిరి.

ప్రతాపరుద్రుని పుత్త్రుఁడు తురుష్కులను దఱిమి వేయుట

తన తండ్రి సామ్రాజ్యములోఁ జేరిన యాంధ్రదేశమంతయుఁ బైని జెప్పినప్రకారము పలుభాగములుగా విడిపోయి పల్వురచేఁ బరిపాలింపబడుచుండుటయు, నాంధ్రనగరము తురుష్కులవశమై యాంధ్రదేశమునఁ దురుష్కులపాలనము బలపడుచుండటయు, అసహాయుఁడై తాను దుస్థితియందుంటయుఁ

  1. ములు సంచారము చేసెను. ఇతడు వ్రాసిన దానికిని అచ్యుతదేవరాయల కాలమునాడున్న పోర్చుగీసువాడైన ఫెర్మానోన్యూజ్, ఫెరిస్తా మొదలగు చరిత్రకారులు వ్రాసిన గాధలకును కాల వ్యత్యాసములు మొదలగునవి కొన్ని కానంబడుచున్నవి. ఇబూబతూతా పైనిజెప్పిన కాలమునున్న వాడు గనుక నతడు వ్రాసినదానియందే యెక్కువసత్యముండవచ్చును గాని యీ చరిత్రకారులు జంబుకేశ్వరునకు బిమ్మట డిల్లీ చక్రవర్తి జంబుకేశ్వరుని మంత్రియగు దేవరాయలను (హరిహరుని) సింహాసన మెక్కించె నని చెప్పుచున్నారు గాని యది యంతగా విశ్వసింప దగినది కాదు.