పుట:Andhrulacharitramu-part3.pdf/29

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దేశము నంతయు జయింపవలయునని మహమ్మద్ తుఘ్‌లఖ్ సంకల్పించెను. ఇతడు క్రీ.శ 1325 వ సంవత్సరమున డిల్లీసింహాసన మధిష్ఠించిన తరువాత దక్షిణహిందూదేశములోని హిందూరాజ్యములకు విపత్తులు సంఘటిల్లెను. ఇతని హృదయపీఠమందు దురాశ, క్రౌర్యము దట్టముగా నలముకొని మూర్తీభవించి కూర్చుండినవి. భరతఖండమునందలి హిందూరాజ్యముల నన్నిఁటి నొక్క గ్రుక్కలో మ్రింగివేయవలయు నన్నంత దురాశ యాతనిబట్టి పీడించుటచేత స్వస్థచిత్తము లేక యుండెను. ఇతఁడు 1326 వ సంవత్సరమున లక్షగుఱ్ఱపుదళములో హొయిసల (మైసూరు) దేశముపై దండెత్తి వచ్చి రాజధాని యయిన ద్వారసముద్రమును స్వాధీనపఱుచుకొని హొయిసల రాజయిన వీరభళ్లాణదేవుని (మూఁడవబల్లాలరాజు) నచటినుండి పాఱఁద్రోలి యానగరమును ధ్వంసముగావించి మరలి డిల్లీనగరమినకుఁ బోయెను. 1310 వ సంవత్సరమున మలిక్ కాపుర్ జయించినది మొదలుకొని దక్షిణమథురాపురము మహమ్మదీయుల వశమై వారిచేతనే పరిపాలింపఁబడుచుండెను. అపుడు కుత్బు-ఉద్దీన్-ఖాన్ మథురాపురమునకుఁ బాలకుఁడు (గవర్నరు)గ నుండెను. వీరభళ్లాలదేవుఁడు ద్వారసముద్రమును విడిచిపెట్టి తూనూరని యెడు తిరువణ్ణామలను (దక్షిణార్కాడు మండలములోనిది) రా