పుట:Andhrulacharitramu-part3.pdf/30

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

జధానిగఁజేసికొని యందే నివసించి యుండెను. ఈ మహమ్మదీయుల దండయాత్రలవలన దక్షిణహిందూదేశమంతయు నొక్కమాఱల్లకల్లోలమయ్యెను. దక్కనునకు రాజప్రతినిధిగా నియమింపఁబడినతన సోదరపుత్త్రుఁడు తనపరిపాలనమును ధిక్కరించి స్వతంత్రపరిపాలనము సేయుచున్నందున వానిని శిక్షించుటకై మహమ్మదు తుఘ్‌లఖ్ చక్రవర్తి గుజరాతునకు (ఘూర్జరమునకు) గవర్నరుగా నున్న ఖాజాజెహా ననువానిని పంపించెను. దేవగిరి సమీపమున వార లుభయులకు ఘోర యుద్ధము జరుగ బహఉద్దీన్ చక్రవర్తి సైన్యములను గెలువఁజాలక పాఱిపోయి యానెగొందిభూపాలుని శరణువేఁడెను. అప్పుడు శరణాగతరక్షకుండని బిరుదు వహించిన జంబుకేశ్వర రాయలు తనకు రాఁబోవు విపత్తునైనఁ దలపోయక యాతురుష్కున కభయహస్తమిచ్చి రక్షణ యొసంగెను[1].

  1. *
    • ఆనెగొందియొక్క పూర్వచరిత్రము రాయవంశావళియను గ్రంథమునందక్క మఱియెచ్చటను గానరాదు. ఈగ్రంథమానెగొంది సంస్థానములో నున్నదఁట. రాయవంశావళియనుగ్రంధమును బట్టి చూడఁగా నందుఁడను రాజు కిష్కింధ(ఆనెగొంది)లో 1214 మొదలు 1276 వరకు, అతనికుమారుడు చాళుక్యుడు 1276 మొదలు 1118 వఱకు పరిపాలనము చేసిరి. వీరికి ముగ్గురు పుత్త్రులు గలరఁట. అందగ్రజుఁడైన బిజ్జులుఁడను నాతఁడు కళ్యాణపురమునకు రాజయ్యెనఁట. విజయధ్వజుఁడను రెండవకొడుకు 1118 మొదలుకొని 1156 వఱకును ప్రభుత్వము