పుట:Andhrulacharitramu-part3.pdf/28

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఏకశిలానగరమునకు దక్షిణభాగమున నుండునాంధ్రదేశము వైపు తురుష్క మహావాయువు వీచుటకుఁ బ్రారంభించినపుడు నడగొండవలె నడ్డుపడి నిలువరించిన మహాశూరుఁడగు రేచెర్ల సింగమనాయఁడు బలాఢ్యము లైన రాచకొండ, దేవరకొండ దుర్గములలో నివసించుచు నోరుగల్లునకు (ఏకశిలానగరము) శ్రీశైలమునకు నడుమనుండు దేశమును బరిపాలనము సేయుచుండెను.

శ్రీశైలమునకు దక్షిణమున నుండు గండికోట రాజ్యమును, పెనుగొండ రాజ్యమును సంగమ రాజపుత్రుడగు బుక్కరాజును, వానికిఁ బ్రాగ్దిక్కున నుండునుదయగిరి రాజ్యమును వాని రెండవయన్న యగు కంపభూపతియును, విద్యానగరము రాజధానిగ నానెగొంది, బరకూరు రాజ్యములను మొదటియన్నయగు హరిహరభూపతియును బరిపాలనము సేయుచు నూత్నకర్ణాటరాజ్య సంస్థాపకులై నలుప్రక్కలఁ గర్ణాటరాజ్యమును విస్తరింపఁ జేయఁబ్రయత్నించుచుండిరి[1].

మహమ్మదీయుల విజృంభణము

ఇదివఱకే యుత్తరహిందూస్థానమంతయు మహమ్మదీయ పరిపాలనముక్రిందికి వచ్చి యుండెను. ఇప్పుడు దక్షిణహిందూ

  • వీరి చరిత్రములు వేర్వేరు ప్రకరణములలో సవిస్తరముగా దెలుపబడును గావున నిచట వివరింపలేదు.
  • వీరి చరిత్రములు వేఱ్వేఱు ప్రకరణములలో సవిస్తరముగాఁదెలుపుబడును గావున నితట వివరింపలేదు