పుట:Andhrulacharitramu-part3.pdf/15

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

13

రెడ్లచరిత్రముగాని నేను వ్రాసినదానికంటె నెక్కువనాకు లభించియుండలేదు. పద్మనాయకుల చరిత్రమువలన నోరుగల్లు చరిత్రమునుగూర్చి ఫెరిస్తామొదలగు మహమ్మదీయచరిత్రకారులును , వారినిబట్టి స్యూయలు మొదలగువారును వ్రాసిన చరిత్రములు సరియైనవికావని తేటపడగలదు. ఈమూడవభాగమును జదువునపుడు రాచవారును, పద్మనాయకులును రెడ్లును పరస్పరద్వేషముల మూలమున సామ్రాజ్యములను బోగొట్టుకొని పారతంత్ర్యమునకు వశులైరనియును, కర్ణాటాంధ్రుల యైకమత్యమువలన కర్ణాటసామ్రాజ్యమని వ్యవహరింపబడిన విజయనగరసామ్రాజ్యము వర్ధిల్లినదనియు జదువరులుకుబోధపడగలదు. పోరునష్టము పొందు లాభమను విషయమునే యీ మూడవభాగము వేనోళ్లజాటుచున్నది.

జీర్ణ కర్ణాట రాజ్య చరిత్ర మనుపేరిట విజయనగరసామ్రాజ్యచరిత్రమును పండ్రెండు సంవత్సరముల క్రిందట నేను రచించి ప్రచురించియున్నవాడను. ఆ గ్రంథము మూడవభాగము తరువాతి గ్రంథముకాగలదు. ఆ గ్రంథము విశేషభాగము మహమ్మదీయచరిత్రకారులు వ్రాసిన చరిత్రములనాధారముచేసికొని స్యూయలుగారి గ్రంథమును గొంతవఱకనుసరించి వ్రాయబడినది గావున నందు సంస్కరింపదగిన పొరబాటులు పెక్కులుగలవు. అందుజేర్పవలసిన నూత్నవిష