పుట:Andhrulacharitramu-part3.pdf/16

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

14 'యము లనేకములు గలవు. దానినే సంస్కరించి నూత్న విషయములజేర్చి సవిస్తరముగా వ్రాసి నాలుగవభాగముగా బ్రకటింపబోవుచున్నాడనుగావున విజయనగరసామ్రాజ్యచరిత్రములోని ప్రథమకర్ణాటరాజవంశమునుగూర్చిన చరిత్రమును గ్రంథవిస్తరభీతిచేనిందు సంగ్రహముగా దెలిపియున్నాడను.

ఈ మూడవభాగమును వ్రాయుటకు నాకు తోడ్పడిన గ్రంథములయొక్కయు గ్రంథకర్తలయొక్కయు నామములీ గ్రంథమున నాయాసందర్భముల బేర్కొనియుంటిని గావున గ్రంథవిస్తరభీతిచే మరలనిచట బేర్కొనక వారెల్లరకు నా కృతజ్ఞతావందనములను దెలుపుచున్నాడను. ఈచరిత్రము యొక్క యచ్చుకాగితములనుదిద్ది నాకు సహాయ్యముజేసిన ఆకొండి వ్యాసనారాయణగారికిని, కామరాజు వెంకటరమణయ్యగారికిని వందనములర్పించుచున్నాను. భ్రమప్రమాదజనితములైన దోషములను మన్నించి చదువరులు గుణములనే గ్రహింపవలయునని ప్రార్థించుచున్నాడను. ఈ గ్రంథప్రాచుర్యమునకు దోడ్పడిన శ్రీయుత వెలగల వేంకటరెడ్డిగారికి గృతజ్ఞుడను.


<right>గ్రంథకర్త.</right>

---