పుట:Andhrulacharitramu-part3.pdf/14

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రమాదములతో గూడిన దోషములు లేక సమగ్రమైనప్రమాణమై యుండునట్లు చేయుట సాధ్యముగాదు. ఆంధ్రదేశ చరిత్రాంశములను గాలక్రమయుక్తముగా సమన్వయముజేసియొకరీతి చరిత్రమాలను గూర్చిభావిపరిశోధకులకు దోడ్పనట్లుగా సంపుటీకరణము చేయుటయె ప్రస్తుతము నేను చేయు పని. నాగ్రంథ మెంతదోషభూయిష్ఠ మనుకొన్నను దేశమున జరిత్రపరిశోధనమునకై పెక్కండ్రను బురికొలుపకమానదు. నాయభిప్రాయము లెన్నడు నితరులను బంధించునవికావు. అసూయాపిశాచాచగ్రస్తులుగాక సత్యాన్వేషణపరులై యెవ్వరైనను సహేతుకముగా నాయభిప్రాయములను ఖండింపవచ్చును. దాన నాకొకింతయు నపయశంబు కలుగ బోదు. విమర్శ మూలముననే సత్యము తేటపడి పరిశుద్ధమైన చరిత్రము వెల్వడు ననుటకు లేశమాత్రమును సందియము లేదు.

ఈ మూడవభాగములో క్రీ.శ 1323 మొదలుకొని క్రీ.శ. 1500 వఱకు గల చరిత్రము సంగ్రహముగా జెప్పబడినది. కాకతీయసామ్రాజ్యము భగ్నమైన వెనుక భిన్నరాజ్యములేర్పడి వేఱ్వేఱు రాజవంశములచే బరిపాలింపబడుటచేత పద్మనాయకులచరిత్రము వేఱుగను, రెడ్లచరిత్రము వేఱుగను జెప్పవలసివచ్చినది. పద్మనాయకులచరిత్రముగాని