పుట:Andhrula Charitramu Part 2.pdf/98

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఈ పద్యములోజెప్పబడిన పృథ్వీశ్వరరాజు వెలనాటిచోడులలోని వాడై రాజరాజచోడచక్రవర్తికి సామంతుడై పండ్రెడవ శతాబ్దాంతముననున్నవాడు. ఇతడు వెలనాటి మనుమగొంకరాజునకును జయాంబికకును దనయుండు. ఇతని శాసనములు క్రీ.శ.1163 మొదలుకొని 1180 వరకును గానిపించుచున్నవి. ఇతడు బ్రదికియున్న కాలముననే క్రీ.శ.1186-87వ సంవత్సరమున నితని తల్లి యగు జయాంబిక తాను గట్టించిన పిఠాపురములోని కుంతీమాధవస్వామి యాలయమునకు గంగైకొండ చోడవనాటిలోని యంతర్భాగమగు ప్రోలనాటిలో నున్న నవఖండవాడయను గ్రామమును దానము చేసెను. కాబట్టి పృథ్వీశ్వరరాజు పండ్రెండవ శతాబ్దాంతమున నుండెననుటకు సందియములేదు.

దానశాసనములు.

ఈ తిక్కభూపాలుని దానశాసనములనేకములు చెంగల్పట్టు మండలములోను, నెల్లూరు మండలములోను గానంబడుచున్నవి. ఇతడు జయంగొండ చోళమండలములో జేరిన పేరూరు నాటిలోని యంతర్భాగమైన చేదికుల మాణిక్యవలనాటిలోని విక్రమసింహపుర మనియెడు నెల్లూరులో నొక పేటయగు మనుమకేశ్వరపురములో నిర్మింపబడిన మనుమకేశ్వర పెరుమాళ్ళకు మండనాటిలోని ఈడప్పూరు గ్రామమును పన్ను చెల్లింపకుండు పద్ధతిని దానము చేసెనని రామతీర్థ దేవాలయములోని యొక యరవశాసనము బట్టి దెలియుచున్నది. ఇందు తిరుక్కాళత్తి దేవుడను మూడవకులోత్తుంగ చోడుని 31వ పదిపాలన సంవత్సరమున నీశాసనము లిఖియింపబడినది. మూడవ కులోత్తుంగ చోడ చక్రవర్తియొక్క 37వ పరిపాలన సంవత్సరమున తిరుక్కాళత్తి దేవుడు పరిపాలనము చేయుచున్నటుల ఊటుకూరు శాసనములవలనను దెలియుచున్నది. కావున నీతడు పేరికి మాత్రము కులోత్తుంగచోడునకు లోబడినవాడై యతని కడపటి కాలమున నుండెను. ఇతని దానశాసనములు రాపూరు