పుట:Andhrula Charitramu Part 2.pdf/99

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కందుకూరు, తాలూకాలలో బెక్కులు గలవు. ఇతడు శాసనములలో చోడతిక్కనృపతియనియు, తిరుక్కాళత్తి దేవ చోడ మహారాజనియు, భుజబల వీర తిరుక్కాళ దేవచోడ మహారాజనియు, వ్యవహరింపబడుచు వచ్చెను. మూడవ కులోత్తుతంగునకి ఇ దరువాత నితడు మిక్కిలి బలవంతుడై స్వతంత్రుడై పరిపాలనము చేసెను.

తిక్కరాజు విజయములు.

తిక్కన కవి తన నిర్వచనోత్తరరామాయణమున దిక్కభూపాలుని వర్ణించు వర్ణనా సందర్భమున మరికొన్ని చరిత్రాంశములనుగూడ వక్కాణించియున్నాడు. వానినీక్రింద నుదాహరించెదను.

"సీ. లకుమయ గురుములూరికి నెత్తివచ్చిన
గొనడె యాహవమున ఘోటకముల,
దర్పదుర్జయులగు దాయాదనృపతుల
ననిలోన బరపడే యాగ్రహమున
శంభురాజాధి ప్రశస్తారిమండలి
కముజేర్చి యేలడే కంచిపురము
జేదిమండలము గాసిగచేసి కాళవ
పతి నియ్యకొలుపడే పలచమునకు

గీ. రాయగండగోపాలు నరాతి భయద
రాయపెండార బిరుదాభిరాము నుభయ
రాయగండాంకు ఖండియరాయుదిక్క
ధరణివిభు బోల రాజులకరిదిగాదె
"

"మ. కమలాప్తప్రతిమానమూర్తి యగు నాకర్ణాట సోమేశు దు ర్దమదోర్వర్గము రూపుమాపి నిజదర్పంబుం బ్రతిష్ఠించి లీ