పుట:Andhrula Charitramu Part 2.pdf/90

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

త్తుంగ చోడ చక్రవర్తి కాలమునకు దరువాత నిర్మింపబడినవి కాని, వానికి బూర్వము నిర్మింపబడినవి కావు.

నెల్లూరు మండలములోని శిలాశాసనములనేకములు మొదటి కులోత్తుంగ చోడుని తరువాత లిఖియింపబడినవే. కులోత్తుంగ చోడ చక్రవర్తి యొక్క ముప్పదిరెండవ పరిపాలన సంవత్సరమున గూడూరు తాలూకాలోని రెడ్డిపాలెమునందలి పాండురంగేశ్వరునకును, పావన వినాయకదేవునకు, భూదానములు మొదలగునవి చేయబడి శాసనము లిఖింపబడినది. అందీభాగము రాజేంద్ర చోడ మండలములోని కడలగొండ 'పవ్వత్తిరి కొట్టమ'ని వ్యవహరింపబడియెను. పైజెప్పిన దేవతలు కాకండి యను మహానగరమున వేంచేసియున్నటుల జెప్పబడియున్నది. ఈ శాసనమున నడవులును బొలములును బావులును నానావిధ ఫలవృక్షములును దానము చేయబడినటుల జెప్పబడియున్నది. ఇది దేవదానమనియు, దీనికి పన్ను తీయబడదనియు, నందు జెప్పబ డియున్నది. [1]ఇతనికి లోబడియీ భాగమును బరిపాలనము చేయుచుండిన మహామండలేశ్వరులగు తెలుగుచోడులెవ్వరో దెలియరాదు.ఇతని కొడుకగు విక్రమచోడుని కాలమున నున్న సామంతులయిన తెలుగు చోడుల నామములు గొన్ని వినంబడుచున్నవి.

మధురాంతక పొత్తపి చోడ బేటరాజు 1121.

ఇతడు తెలుగు బిజ్జనవంశమున జనించిన మొదటికులోత్తుంగ చక్రవర్తి కుమారుడును, వరకేసరివర్మ బిరుదాంకితుడునగు విక్రమచోడుని కాలమున నాతనికి లోబడిన మాండలికుడుగ ఉండి పొత్తపి నాటిని బరిపాలించుచుండెను. ఇతడు విక్రమచోడుని విజయమునకై క్రీ.శ.1120_21వ సంవత్సరమున నొక దానశాసనమును వ్రాయించుటయే పై యంశమును స్థాపించుచున్నది. ఇతని శాసనము పొత్తపి నాటిలోని నందలూరు గ్రామమునగన్పట్టుచున్నది. ఈ బేటరాజును, మరియొక తెలుగుచోడుని శాసనము

  1. Nellore Inscriptions. Vol. I. p.443, G.87.