పుట:Andhrula Charitramu Part 2.pdf/89

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

డుల యధికారము నెల్లూరు మండలములోని దిగువభాగమునకు వ్యాపించుటకభ్యంతరము గలిగినదని యెంతమాత్రమును దలంపరాదు. కాబట్టి నెల్లూరు మండలములోని యుత్తర భాగము వేంగీదేశములోను దక్షిణభాగము జయంగొండ చోళమండలములోను జేరియుండెనని నిస్సంశయముగా జెప్పవచ్చును. అయినను నెల్లూరునకు దిగువభాగమునందలి దేశమున మొదటి పరాంతకుడు మొదలుకొని మొదటి కులోత్తుంగ చోడుని వరకు శాసనము లేవియునంతగా గానంబడకుండుట చేత నా భాగము చాలవరకు నిర్జనారణ్యముగానుండెనని నూహింపబడుచున్నది. మొదటి పరాంతకుని నాటనుండియు ద్రావిడదేశమునందు బెక్కు దేవాలయములు స్థాపింపబడి పెక్కు శిలాశాసనములు లిఖియింపబడి యున్నవి. ఈ భాగము చోడులవశమై యున్నను మొదటి కులోత్తుంగుని కాలము వరకు నొక్క శాసనమైన గానరాదు. శాసనములు మాత్రమేగాక వీరు కట్టించిన పురాతన దేవాలయములయిన నా ప్రదేశమున గానరావు. ఆ ప్రదేశము శైవులకుగాని వైష్ణవులకుగాని పవిత్రములైన పుణ్యక్షేత్రములేవియును గానరావు. ఈ ప్రదేశము అనంతపురము, బళ్ళారి, కడప, కందవోలు మండలముల వలెనే దండకారణ్యములో నొక భాగముగానుండి చాలకాలము నిర్జనప్రదేశముగానే యుండినది. ఆ హేతువుచేతనే ఈ ప్రదేశమునందు పురాతన దేవాలయములుగాని, పురాతన బ్రాహ్మణాగ్రహారములు గాని లేకపోయెను. మొదటి కులోత్తుంగ చోడచక్రవర్తి కాలమున వేంగీ చోడ రాష్ట్రములు కలసిపోయినప్పుడు రామానుజుని కాలమున నుద్ధరింపబడిన వైష్ణవమతతరంగ మొకటి కాంచీపురమునుండి యుత్తరభాగమున కెగబ్రాకెను. కులోత్తుంగుని పరిపాలనావసాన సమయమున ను, దరువాతను, సామంతమాండలిక రాజకుటుంబములవారు తెలుగు దేశములో నందందు గుదురుకొనుటచేత నిస్సారమైన యా భూప్రదేశము జనాకీర్ణమై వర్ధిల్ల మొదలుపెట్టెను. తరువాత దేవాలయములు నిర్మింపబడుచు వచ్చినవి. ప్రస్తుత కాలమునందు గన్పట్టెడి దేవాలయములు మొదలగునవి మొదటి కులో