పుట:Andhrula Charitramu Part 2.pdf/84

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యున్నది. వీనింబట్టి బల్లయచోడదేవమహారాజునకు బుత్త్రుడని స్పష్టపడుచున్నది. ఈ కామచోడదేవ మహారాజునకు భీమన ప్రెగ్గడగనున్నట్లొక శిలాశాసనమువలనను, గుండయ దంనాయకుని పుత్త్రుడు రామన్నదండనాయకుడు సైన్యాధ్యక్షుడుగనున్నట్లు మరియొక శాసనమువలనను, శ్రీధరభట్టు పురోహితుడుగనున్నట్లు వేరొక శిలాశాసనమువలనను దెలియవచ్చుచున్నది. ఇతనికొడుకు త్రిభువనమల్ల దేవుడు.

త్రిభువనమల్ల దేవచోడమహారాజు.

ఈతడు శా.శ.1070వ సంవత్సరమునకు సరియైన క్రీ.శ.1148వ సంవత్సరమున దన తండ్రి పొత్తపి కామచోడదేవమహారాజునకును, తల్లి శ్రీయదేవికిని, పుణ్యము కలుగుటకొరకు కొట్యదొనలోని భీమేశ్వరాలయమునకు భూదానము చేసియుండెను. ఈ భీమేశ్వరాలయమును ఇతని సేవకులలోనొకరు గట్టించిరని మరియొక శిలాశాసనమువలన గన్పట్టుచున్నది. శంకరమహాదేవాలయములోని మరియొక శిలాశాసనమునుబట్టి శ్రీయదేవి, పొత్తపి కామచోడదేవుడు, నీతనికి తల్లిదండ్రులని యుదాహరింపబడియున్నది.. కాబట్టి ఈతడు బల్లయచోడదేవ మహారాజునకు మనుమడ గుచున్నాడు. ఈతడు కొట్యదొనలోని కొండపై త్రిభువనమల్ల శ్రీకేశవదేవాలయమును నిర్మించెను. ఆ దేవాలయములోని శాసనములలో నాకొండకు "అభినవరైవతకాద్రి"యను పేరు గలిగినట్లుగా చెప్పబడినది. కమ్మనాటిని బరిపాలించిన కొణిదెన చోడులలో నీ త్రిభువనమల్ల చోడదేవుడు మిక్కిలి పరాక్రమవంతుడుగ గన్పట్టుచున్నాడు. ఇతని పట్టమహిషి మాబలమహాదేవి. కేతనయనునాతడీతనికి బ్రెగ్గడగనుండెనని యొక శిలాశాసనమువలన దెలియవచ్చుచున్నది. ఇతని శాసనములు కమ్మనాటిలోని వంగవోలు సీమలోని దర్శిసీమలోను గానవచ్చుచున్నవి. ఇతని పరిపాలనము క్రీ.శ.1154_55వ సంవత్సరమువరకు జరుగుచుండెనని శాసనములవలన దెలియుచున్నది. ఇత