పుట:Andhrula Charitramu Part 2.pdf/72

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నన్నెచోడ కవిరాజశిఖామణి.

ఇతడు కుమారసంభవమను ప్రౌఢకావ్యమును రచించిన కవిరాజశిఖామణి. ఇతడు తన కుమారసంభవములో దన తల్లిదండ్రులనుగూర్చి చెప్పిన పద్యమును మీదనుదాహరించి యున్నాడను. మరియు నితడు సగరసుతులను, భగీరథుని, రాఘవుని, కరికాలచోడుని సూర్యవంశాధిపతులుగా బేర్కొని వారి కెనవచ్చు సుశ్లాఘధనులనని యీ క్రింది సీసపద్యములో జెప్పికొనియున్నాడు.

"సీ. కుతలంబునడుకొన గొలగొండగా నిల్పి
శరనిధిగ్రొచ్చిరి సగరసుతులు,
మిన్నులపై బారుచున్న యే రిల దెచ్చి
వారాశినించె భగీరథండు,
గోత్రాచలములెత్తికొని వచ్చి కడచన్న
రత్నాకరముగట్టె రాఘవుండు,
జలధి మహీపతి మొలనూలుగాజుట్టి
పాలించె గరి గరికాలచోడు,
వరుసనిట్లు సూర్యవంశాధిపతులంబు
నిధయ మేరగాగ నిఖిలజగము
నేలిచనినవారి కెనవచ్చు సుశ్లాఘ
ధనుడ నన్నెచోడ జనవిభుండ."

ఈ నన్నెచోడునిగూర్చి కుమారసంభవములోని పీఠికయందిట్లు వ్రాయబడియున్నది. [1]

  1. ఈ గ్రంథమును శ్రీయుత మానవల్లి రామకృష్ణయ్యపంతులు ఎమ్.ఏ., గారు నూతనముగా బ్రకటించియొక పీఠికను వ్రాసియున్నారు.