పుట:Andhrula Charitramu Part 2.pdf/73

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

“ఇతడు కావేరీ తీరమున నొరయూరనుపురము రాజధానిగా జోళమండలమునేలినవాడు. ఇతనికి దిగ్విజయమునుబట్టి టేంకణాదిత్యుడనియు, గవిత్వకౌశలమువలన గవిరాజశిఖామణియనియు, బిరుదములు గలిగెను. ఇతడు క్రీ.శ.940వ సంవత్సరమున బాశ్చాత్యచాళుక్యులతో నెదిర్చి రణరంగమున నిహతుడయ్యెను.”

ఈ పైనిజెప్పబడిన నన్నెచోడుని కాలమును స్థలమును సరియైనవి కావని చరిత్రపరిశోధనము వలన దెలియుచున్నది. ఆ కాలమున నొరయూరు రాజధానిగ జోళమండలమును బరిపాలించుచున్నవాడు మొదటి పరాంతకుని కుమారుడగు రాజాదిత్యుడేగాని నన్నెచోడుడుగాడు. [1]

ఈ రాజాదిత్యుడు రాష్ట్రకూటరాజయిన మూడవ కృష్ణరాజుతో తక్కోలమను ప్రదేశమున యుద్ధముచేసి రణనిహతుడయ్యెను. కాబట్టి నన్నెచోడుడాకాలమున నొరయూరును బరిపాలించుచున్న వాడను మాట నిరాధారమైనది. నన్నెచోడ నామము గలవారు పెక్కండ్రు పాకనాటి కమ్మనాటి తెలుగుచోడులలో గాన్పించుచుండుటచేతను, తన గ్రంథమునందు నన్నెచోడుడు పాకనాటి పేరు నుదాహరించి యుండుటచేతను, శ్రీశైలమునందుండెడు తన గురువయిన మల్లికార్జునయోగి నభివర్ణించి తన కావ్యమునంకితము చేసియుండుటచేతను, తప్పక నన్నెచోడుడు తెలుగుచోడులలోని వాడు గాని యన్యుడు గాడని స్పష్టమగుచున్నది. ఇంతియుగాక, పాకనాటికధీశుడైన చోడబల్లియొక్కయు, శ్రీసతియొక్కయు దనూజుడనని చెప్పికొనియుండుటచేత నితడు తప్పక కొణిదెనచోడవంశములోని వాడని చెప్పవలయును. పొత్తపినాటిని, పాకనాటిని, కమ్మనాటిని,బరిపాలించిన తెలుగుచోడులెల్లరు నొరయూరు పురవరాధీశ్వరులమని తమ శాసనములందు బేర్కొనియున్నారు. “అవశ్యంపితురాచార”మ్మనునటుల బెద్దలయాచారాము నవలంబించి ఘనతకొఱకు నొరయూరు పురవరాధీశ్వరులమను

  1. The Early History of India by V.A.Smith., p.419.