పుట:Andhrula Charitramu Part 2.pdf/48

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కాలమున మాలలసాహాయ్యముచే దానపాయమునుండి తప్పించుకొన్నందుకు ప్రత్యుపకారముగా మాలలకీ స్వాతంత్ర్యమునొసంగెనని ప్రసన్నామృతమను గ్రంథమునందు వ్రాయబడినది. ఇట్టి స్వాతంత్ర్యము మేలుకోటలో మాత్రమేగాక బేలూరుశ్రీరంగ దేవాలయములలో గూడ సంవత్సరమునకొకమారు కలుగజేయబడినది. ఆ కాలమున బంచములు బ్రామ్మణులను దాకినను బ్రాహ్మణులపవిత్రతయని తలంపరట! [1]

రామానుజుని గ్రంథరచనము _ మతవ్యాప్తి

రామానుజుడు గూడ శంకరాచార్యునివలెనే వ్యాసవిరచిత బ్రహ్మసూత్రములకును, ఉపనిషత్తులకును, భగవద్గీతలకును, భాష్యములను వ్రాసెను. ఈ సంస్కర్తచే విరచింపబడిన బ్రహ్మసూత్ర భాష్యమును శ్రీభాష్యమనెదరు. ఇతడు నయమునను భయమునను తన మతమును వ్యాపింపచేసెను. ఇంతకు బూర్వము శివస్థలముగానుండిన తిరుమత దేవాలయమునాక్రమించుకొని విష్ణ్వాలయముగమార్చెను. చోడచక్రవర్తి మరణమునొందిన తరువాత శ్రీరంగము మొదలగు వైష్ణవక్షేత్రములకు జని మతబోధ గావించుచుండెను. కలోత్తుంగ చోడచక్రవర్తి కుమారుడు విక్రమచోడుడే తండ్రి మరణానంతరము రామానుజుని తన దేశమునకు రప్పించియాదరించెను. ఈతని సంప్రదాయమును విశిష్టాదైవ్తమనియెదరు. ఈ సంప్రదాయమువారిని శ్రీవైష్ణవులని చెప్పుదురు. ఈతడు బౌద్ధమతాచారములను బెక్కింటిని గ్రహించి తన వైష్ణవమతమునందు జొప్పించి మతవ్యాపనము గావించెను. ఇతడు 128 సంవత్సరములు జీవించి వైకుంఠ పదవికేగెనని చెప్పుదురు.

విక్రమాదిత్యుడు.

క్రీ.శ.1118వ సంవత్సరమున చోడచక్రవర్తియగు కులోత్తుంగ చోడదేవుడు మరణమునొందెను. వేగిదేశమునకు రాజప్రతినిధిగా నుండిన

  1. The Life and Teachings of Sri Ramauja by C.R.Srinivas Aiyangar, p.224