పుట:Andhrula Charitramu Part 2.pdf/47

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దెను. కాబట్టి రాజు సంతోషపూర్వకముగా జైనమత గురువులనాదరించి ప్రసాదమును స్వీకరించెను. జైనమతాచార్యుల శుభాగమనమును మిక్కిలి సంతోషించి తన కుమారునకు విజయనరసింహుడని పేరుపెట్టి నూతన జైనాలయములోని దేవుని విజయపార్శ్వనాధుడనవలసినదిగా నుత్తరువు చేసెను. హోసలేశ్వరుని మహాలయమునకు నెదురుగనన్నూత నలువది గజముల దూరములోనున్న ఈ జైనాలయమిప్పటికిని జైనయాత్రికులచే దర్శింపబడుచున్నది. ఇట్టి చరిత్రాంశములు విష్ణువర్ధనుడు జైనులను వధించెనని చెప్పెడు స్థలపురాణగాధలను వైష్ణవమత గాథలను బూర్వపక్షము చేయుచున్నవి. క్రీ.శ.1117వ సంవత్సరమున విష్ణువర్ధనుడు వైష్ణవమతమును స్వీకరించెనని హాలెవీడులోని యొక శాసనము దెలుపుచున్నది. ఈ విషయములన్నిటిని సమన్వయించుకొనుట కష్టసాధ్యముగనుండును. ఏదియెట్టులున్నను ఆకాలమున జైనులనేకులువైష్ణవమతములో జేర్చుకొనబడిరనుమాట సత్యము. జైనులను బౌద్ధులను మాత్రమేగాక, తక్కువ జాతి వారలనేకులను వైష్ణవులను గావించెను.

రామానుజుడు _ తిరునారాయణపురము _ మాలమాదిగలు.

బౌద్ధులు వాదములందు గెలువలేక క్రోధోన్మదులై విష్ణ్వాలయంబుల కపాయంబులాపాదింప నుద్యుక్తుయినప్పుడు రామానుజుడు మాలమాదిగలచే వారలంబట్టి రాతిగనులలో బెట్టించి నిశ్శేషముగా నురుమాడించి తనకుపకారము చేసిన యాపంచములయెడ బ్రసన్నుడై ప్రతివత్సరంబునందును శ్రీనారాయణదేవుని మహోత్సవకాలమున నేడవదినంబు మొదలుకొని తొమ్మిదవ దినంబు పర్యంతంబు దినత్రయంబును వారలు దేవాలయములోని బలిపీఠము వరకరుదెంచి కైంకర్యాదులొనర్చి సేవించునట్లాజ్ఞాపించెనని ఆచార్య రత్నహారము మొదలగు గ్రంథములలో వ్రాయబడినవి. రామానుజుడు తన కుమారుడైన సంపత్కుమారునితో ఢిల్లీనగరమునుండి వచ్చునప్పుడు దారిదోపిడీగాంద్రచే ముట్టడింపబడి చిక్కువడియున్న