పుట:Andhrula Charitramu Part 2.pdf/46

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

హాలెవీడులోని జయంగొండేశ్వర శివాలయమునకు క్రీ.శ.1121వ సంవత్సరములో భూదానము చేసినట్లుగ విరూపాక్షపురములోని యొక శాసనమువలన దెలియవచ్చుచున్నది. కేతమల్లుడను వర్తకుడొకడు 1121వ సంవత్సరమున విష్ణువర్ధన హోసలేశ్వరుడను పేర నొక శివాలయమును గట్టించెను. మరియు నీతని పంచప్రధానులలో గొందరు జైనమతాభినివేశ పరవశులుగ గన్పట్టుచున్నారు. ఇంతియగాక 1123వ సంవత్సరమున జైన మతావలంబిని యగు తన భార్యకు నొక గ్రామమునీయగా నామె దానిని 200 బ్రాహ్మణులకు విభాగించియిచ్చెనట!ఆ సంవత్సరముననే యతని భార్య శాంతలదేవి శ్రావణబెలగోల గ్రామములో గంధవారణమను బస్తిని గట్టించెను. మరియు 1125వ సంవత్సరమున మహోపాధ్యాయుడును తార్కిక చక్రవర్తియు జైనుడునగు శ్రీపాలుడను వానికి భూదానము చేసెను. 1128వ సంవత్సరమున యాదవపుర మను మేలుకోటలో చాముండికొండపై నుండి మర్బలతీర్థమునకు (శివాలయములోని యొక భాగము కాబోలు) దానశాసనము వ్రాయించెను. విష్ణువర్ధనుని కుమారుండును, జ్యేష్ఠపుత్రికయగు హరియలెయను నామెయు, ఆమె చెల్లెండ్రును జైనులనియే చెప్పబడుచున్నారు. మరియు దలకాడు ముట్టడించి వశపరచుకొని శైవులయిన చోడచక్రవర్తులచే నాశనముచేయబడిన జైనదేవాలయములు పెక్కింటిని పునర్నిర్మాణము చేసినవాడును విష్ణువర్ధనుని సైన్యాధ్యక్షుడును, మహాయోధుడునగు గంగరాజు జైనులకు జైనమతమునకు మ్రాతమేగాక రాజునకును గొప్పప్రాపుగ నుండెనని చెప్పబడియున్నది. 1133వ సంవత్సరమున సైన్యాధిపతియగు గంగరాజు మరణమునొందగా వాని కొమారుడు బొప్పరాజు హాలెవీడులో తండ్రి జ్ఞాపకార్థము ద్రోహఘరట్టమను జినాలయమును నిర్మించెను. ఈ ప్రతిష్ఠాపన కాలమునందు నయకీర్తియను జినాచార్యుడు దివ్య ప్రసాదమును రాజునకుబంపగా వెంగాపురమునేలు మాసన్నపై దండెత్తిపోయి వానినోడించి విష్ణువర్ధనుడు మరలివచ్చు కాలమున నడిత్రోవలో వాని రాణి లక్ష్మీదేవి ప్రసవించి కుమారుని గన్న సమయమున బ్రసాదమం