పుట:Andhrula Charitramu Part 2.pdf/398

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ప్రతాపరుద్రుడు శ్రీశైలమునకు బొవుట

 ప్రతాపరుద్రుడు మహమ్మదీయులతో పైన యుద్ధమువలన నధికనష్టమును బొందివాడు గావున మరల ధనమును సంపాదించి రాజ్యమును బాగుపఱచు కొనవలసి యుండెను. అదియునుగాక తనరాజ్యమునకు దక్షిణసరిహద్దులలో నుండుమండలేశ్వరులు స్వతంత్రు లగుటకు బ్రయత్నములు సలుపుచుండుటవలన వారలను శిక్షించి సరిహద్ద్లను గాపాడవలసియుందెను. మఱియును మతాభినిరతి కలవాడు గావున మార్గమధ్య;మున నుండు శ్రీశైలక్షెత్ర మునకు బోయి మల్లికార్జునస్వామిని సందర్శింప గోరి ప్రతాపరుద్రుడు ముందుగా ద్రిపురాంతమునకును పిమ్మట శ్రీశైలమునకు బోయి యాక్షేతములకు ననేకభూదానములను గావించెను. అచ్చటనుండి ప్రతాపరుద్రుడు బయలుదేఱి కొచ్చెర్లకోటదుర్గమునకు బోయి యచ్చట కొంతకాలము నివసించెను. ఆకాలములొ దన వేటకాండ్రగు ఇరికప్ప, కేతినాయకుడను వారికి నచ్చట నొకప్రదేశమున నడవి నఱికి గ్రామమును గట్టవలసిన దని యుత్తరువు చేసెను.  దీనినే దుప్పిపాడు లేక దూపాడు అని జనులు వ్యవహిరించుచున్నారు.  దీని చుట్టునుండు దేశమును దూపాడుసీమ యని పేరు పెట్టి అనుమకొండ నివాసియైన శ్రీనాధరాజునకిచ్చెను. అతడొకభవనమును గట్టుకొని యాసీమను బరిపాలించుచుండెను. కళ్యాణపురమునుండి సిరసింగళ మహాదేవుడను నతడు తనమేనమామ కూతురైన సింగళదేవితో గూడ లేచివచ్చి ప్రతాపరుద్రుని నాశ్రయించినందువలన నతనికి నందికోటకూరు సీమ నొసంగెను. అతడా యరణ్యప్రాంతమును జక్కపఱచి గ్రామములను గట్టించి తనచరిత్రముతో సంబంధించిన నామములనే వానికి బెట్టెనట! అతడు పాలుత్రాగిన ప్రదేశమునకు బాలమాఱి యనియు, అతడు శత్రువుల