పుట:Andhrula Charitramu Part 2.pdf/397

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

నేక శిలానగరదుర్గము చుట్టును నెంతమాత్రమును తెఱచి లేక యుండ మహమందీయభటు లాక్రమిమించుకొని యుండిరి. "క్వాజానసీరుల్ ముల్కుసీ రాజద్దౌలత్" అనువాని నధికారము క్రింద నీసైన్య ముంపబడియెను. ఒకనాటి రాత్రి కొటలోనుండి వినాయకదేవుడనెడు సేనాపతి యొకడు మూడువేల గుఱ్ఱపు దళముతో వచ్చి కఱ్ఱాబేగు అను మహమ్మదీయ సైన్యాధిపతి పైబడియెను. ఉబయసైన్యముల కప్పుడు ఘోరయుద్ధము జరిగెను. హిందువుల మూడువేల గుఱ్ఱఫూ దళమును సైన్యాధిపతితోగూడ నాశన మయ్యెను. మహమ్మదీయభటులు పిశాచములవలె సుస్థిర్ చిత్తులై నిలివంబడి యుద్ధముచెసిరి. ఇట్లు కొన్నిదినములు జరుదునప్పటికి మహమ్మదీయసేనాదులు విజృంభించి శత్రువులు తమపై గురిఫించు నగ్నిహోత్రములో బడ మిడతలవలె మ్రగ్గుచున్నను భీతచిత్తులుగాక అప్రతిమాన ప్రతాపముతో వీరరసము మూర్తీభవించి నదో యన నాయగ్నిహోత్రం నెదుర్కొని "హుజ్జాహుజ్, ఖుజ్జాఖుజ్ " అను ధ్వనులు మిన్నుముట్టుచుండ దెంపరులై ఫోయి కోటకు వెలుపలి ప్రాకారముగా నున్న మట్టిగోడ నాశ్రయించుకొనిరి. అక్కడి నుండి చూడ వారలకు ఱాతికోట గానిపించుచుండెను. ఇంతవఱకు వచ్చిన తరువత సంధిచేసుకొనకుండుట నీతి కాదనియు నయాయకర మనియు నిశ్చయించి మంత్రిఅర్గముతో నాలోచించి ప్రతాపరుద్రుడు రహస్యముగా మలిక్ కాఫురునకు సందేశమును బంపెను. ఎ ట్లయినను ప్రతాపరుదుడు లోబడినదే చాలు నని మలిక్ కాఫూర్ సంతోషించెను. తాను లోబదినందుకు గుర్తుగా తన సువర్ణప్రతిమన్ వారికి బంపి యనెకరత్నాభరములను ధనము నొసంగెనట! అంతట కలీక్ కాఫుర్ ముట్టడి మాని ధనబారమును వహించిన వేయియొంటలతోడ క్రీ.శ.1310 దవ సంవత్సరము మార్చి నెల 16వ తేదీని ఢిలీకి బయనమై పోయెనని అతిశయోక్తిగా అమీరుఖుస్రూ యను మహమ్మదీయ చరిత్రకారుడు వ్రాసి యున్నాడు.