పుట:Andhrula Charitramu Part 2.pdf/399

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

తోడ బోరాడునపుడు కంఠహారమున్ విడిచిపెట్టిన స్థలమునకు వనమాల పా డనియు, అలుగులతొ దాను పొరాడిన స్థలమునకు అలుగులూ రనియు నామములు కలిగె నని జనులు చెప్పుకొందురు. ప్రతాపరుద్రచక్రవర్తి యా కాలముననే కందనోలెసీమను విడెముకొమ్మరాజునకు కొసంగెను. ఈమండలేశ్వరునకు నాగరాజు అను నియోగిబ్రాహ్మణుడు మంత్రిగ నుండి యనేక గ్రామములను నిర్మించి దానధర్మములను గావించి ప్రఖ్యాతిగాంచెను. శా.శ.1232 వ సంవత్సరములో (1310) నీతని పేరిటిదానశాసనములు ముద్దనూరు, కాల్వ, చామగట్ల, మల్యాల, అనుప్రదేశములందు గానబడుచున్నవి.

జుట్టయలంక గొంకారెడ్డి.

  ములికినాడు, పొత్తడినాడు, గండికోటసీమలలో నివసించియున్న త్రిపురాంత కాంబదేవుల బంధువయిన మల్లరాజు మొదలగువారు కొందఱు వడ్డేరాజులతో గలిసి తిరుగబది స్వతంత్రులగుటకు బ్రయత్నింపగా బ్రతాపరుద్రుడు చతురంగబలసమేతుడైపోయి వారిని నోడించి యాదేశములకు దనపుత్రు డయిన జుట్టయలంక గొంకారెడ్దిగారిని నధిపతిని గావించెను. ఇతను శాసనములు కొన్ని ములికినాటి సీమలో గానవచ్చుచున్నవి. అందు చెరనూరి శాసనములొ నిట్లున్నది.
  "స్వస్తిశక వర్హంబులు 1236 (1313) అగునేటి ప్రమాదీవ సంవత్సరశ్రావణ శు 12 బుధవారమునాడు స్సస్తిశ్రీమహామండలేశ్వర కాకతీయ ప్రతాపరుద్రుదేవమహారాజు కుమారుడు మూర్లోక గండమూర్తి ముకుంద్ కంఠ తీర్ణత్రిప్రతిజ్ఞపరశుబిరుదాంక రుద్రబిరుద బ్రహ్మరాక్షస గండికోట దుర్గవిభాళ మల్లదేవర గొండుగంద స్వయంభూనాధ దేవ దివ్యశ్రీపాదపద్మారాధక మహారాయ కంఠకాలనాయకుండైన జుట్టయలంక గారు" జుట్టయప్రతాపరుద్రుని కుమారుడని యాశాసనములోని సంస్కృతశ్లోకములలో గూడ