పుట:Andhrula Charitramu Part 2.pdf/396

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

దీయ సేనాధిపతికి మార్గము సులభసాధ్య మయ్యెను. శాత్రవసైన్యంబులు సరిహద్దుకోటల నాక్రమించుకొని గోదావరివఱకు రాగ హిందువుల కాందోళన మెక్కువయ్యెను. ప్రసిద్ధులయిన సేనాను లందఱును రాజధానిదుర్గమును బ్రవేశించిరి. వేలకొలది రాచవారు, కమ్మవారు, వెలమవారు, రెడ్లు, వంటరులు మానమును గోలుపోవుటకన్న బ్రాణమును గోల్పోవుటయె శ్రేష్టమని రణ భూమికి రమ ప్రాణంభు లర్పించి శాశ్వతమైన యశంబును సంపాదించిరి. శత్రువులు మర్గమధ్యమున వాణీకవిదేవునిచే సంరక్షింపబడుచున్న సర్బరదుర్గమును ముట్టడించి యగ్నిహోత్రమును దాకొలిపి ప్రజ్జ్వరింపజెసిరి. వాణీకవిదేవుని వీరభటులుఇ స్త్రీశిశువుసమేతముగా నాయగ్నిహోత్రము నెదుర్కొని వీరస్వర్గమును జూఱగొనిరి. అగ్నిహోత్రము పాల్పడక బ్రదికి బైటపడిన వీరభటులు ప్రాణ మున్నంత దనుక శత్రువీరులతో ఖడ్గయుద్ధములు చేసి నేలగూలిరి. సర్బదుర్గము మహమ్మదీయుల అధీన మాయెనని అమీరు ఖుస్రూ యను చరిత్రకారుడు రాయుచున్నాడు. ఇట్లు మహమ్మదీయులు హిందువులతో బాహుయుధ్ధము జేయుచు ద్రొచుకొని వచ్చుచుండ హిందూసేనాను లెల్లరును మరలి యేకశిలానగరదుర్గములో బ్రవేశించిరి., శాత్రవులోరుగంటి దుర్గమును ముట్టడించిరి. తురుష్కసైన్యము లొరుగంటి కోటచుట్టును నివాసస్థానము లేర్పఱచుకొనిరి. మట్టికోట వెలుపలి ప్రాకారము యొక్క చుట్టుకొలత పండ్రెండువేల యైదువందల నలువరియాఱు గజములుండె నని మహమ్మెదీయ చరిత్రకారులు వ్రాసియున్నరు.

     ఈయోరుగంటి కోటగోడ మట్టితో జెయబడి ఉక్కుబల్లెముతో పొడిచినప్పకైన నొక్క బెల్లయినను రాలకుందునట్టిదిగా నుండె నని యా చరిత్రకారులే వ్రాసియున్నారు. తురుష్కసైన్యము లనేకభాగములుగ విభాగింపబడి యొక్కొక్క భాగము పండ్రెండువందల గజముల స్థలౌ చొప్పున నాక్రమించుకొని ప్రాకార్ము చుట్టును విడిసియుండిరి. ఈ ప్రకారముగా