పుట:Andhrula Charitramu Part 2.pdf/395

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ర్వకముగా గప్పము చెల్లించుచుండెను. ఇట్లు తాను తురుష్కులచే జయింపబడి ఢిల్లీచక్రవర్తికి గప్పము గట్టుచుండగా దన ప్రతిపక్షియైన ప్రతాపరుద్రుడు స్వతంత్రుడై యుంట రామదేవునకు మనం బెరియించుచుండేను. అసూయా తత్పరుడై రామదేవు డట్లు మహమ్మదీయులతొడ గుట్రలు చేసి వా రాంధ్రదేశము పై దండెత్తి వచ్చునటుల బ్రోత్సహించెను. రెండు తడవలాంధ్రులతో బోరాడి యొడి పాఱినవాడగుటచేత మలిక్ కాఫర్ చక్రవర్తి యనుజ్ఞగైకొని నులువదివేల గుఱ్ఱపుదళము తోడను లక్షకాల్బలముతోడను బుండేలుఖండము మార్గము మీదుగా బయలుదేరి వచ్చి దేవగిరిలో గొంతకాలము నివసింది రామచంద్రదేవు డొనరించిన యాతిధ్యము నంగీకరించి తనసైన్యముఇనకు గావలసిన పదార్ధముల నన్నిటిని నతడే సమకూర్పం గా గృతజ్ఞతావందనపూర్వకముగ గ్రహించి యచ్చటనుండి బయలువెడలి యాంధ్రదేశమును ప్రవేశించెను. ఈతృతీయదందయాత్ర క్రీ.శ.1309 వ సంవత్సరాంతమున సలుపబడినది.

మహమ్మదీయుల తృతీయదండయాత్ర.

   మరల మలిక్ కాఫర్ మహాసైన్యముతొ దండెత్తి వచ్చుచున్నాడను వార్త వ్యాపించినతోడనే దేశమున నొక మహాసంక్షోభము జినించెను. మహమ్మదీయులు తమ పూన్కిని విడువక యిట్లు పలుమాఱు దాడివెడలి వచ్చుటవలన హిందువుల ధైర్యకందుకము సడలుచుండెను. అయినను ప్రతాపరుద్రుని సేనానులు రణశూరు లగుటచేత నించుకయంజలింపక చక్రవర్తి యాజ్ఞను విశ్వాసపూర్వకముగా దల నిడుకొని తమతమ నియమిత స్థానంబులను విడువక ప్రాణంబులర్పింపవలసినను వెనుదీయక కార్యాగ్ని బ్రజ్జ్వలింప జెయుచు శత్రువుల నెదుర్కొని భయంకరముగా బోరాడీరి. మహమ్మదీయులకు గుఱ్ఱపుదళ మధికముగా నుండుటచేతను సరిహద్దుల మార్గములందు హిందువులు సుస్థిరచిత్తుడై నిలువంబడి పోరాడజాలక దారి యిచ్చుటచేతను మహమ్మ