పుట:Andhrula Charitramu Part 2.pdf/375

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

"చ. అమరహుళిక్కి భాస్కరమహాకవి చెప్పగ నున్న యుద్ధకాం
     డము తరువాయి చెప్పె వికటప్రతిభాషణు డప్పలాచార్య స
     త్తమసుతు డయ్యలార్యుడు గృతస్థితి నార్యులు మెచ్చునట్లుగా
     హిమకర తార భాస్కర మహీవలయ స్థిరలక్ష్మి చేకుఱన్."

        అని చెప్పియుండుటచేత యుద్ధకాండములో గొంతభాగము (1134 పద్యములు) హుళిక్కభాస్కరుడు చెప్పె నని చెప్పెనే గాని  హుళిక్కి భాస్కరుడు తనకు మిత్త్రుడని యెక్కడను జెప్పి యుండలేదు. మఱియు యుద్ధకాండాంతము నందలి పద్యములు శివుని సంబోధించునవిగా నున్నవి గనుక నితడు సాహిణిమారుని కాలములోనివాడు కాడనుట నిశ్చయము.  వేదరిగినాయనింగారి ప్రేరణముచేత నీగ్రంధభాగం నయ్యలార్యుడు వ్రాసె నని ప్రాచీనతాళపత్త్రసంపుటములలో గొన్నిట వ్రాయబడియుండుటంజేసి యితడు క్రీ.శ. 1370-20 నడుమకాలమున నున్నవాడనుట నిశ్చయము.  కాబట్టి రామాయణములోని విశేషభాగము సాహిణిమారుని మరణానంతరమే రఫింపబడి యుండవలయును. అట్లు గాకయున్నశివునిం గూర్చిన సంబోధనమ్లు గల పద్యము లీ రామాయణమున నుండుటకే ప్రమేయముం గానరాదు. ఎన్నివిధములుగా బరిశీలించి చూచినను అరణ్య కాండము తక్కినకాండముల కంటె బూర్వము రచింపబడి యుండునని విదిత మగుచున్నది. అట్లయినయెడల రంగనాధరామాయణమును రచియించిన బుద్ధరాజునకు బుత్రుడని చెప్పబడెడి సాహిణిమారుడు రామాయనము నంతయు విడిచి ముందుగా భాస్కరమహాకవిచే నారణ్యకాండము నంకితము నొందుట నేమి హెతువో దెలియరాదు? భాస్కర రామాయణముం గూర్చిన యధార్ధకధన మింకను మఱుంగననే యున్నది.  అయ్యడి భావిపరిశోధనముల మూలమునం దెలిసికొనవలసి యున్నది.  సాహిణిమారుడు రంగనాధరాయణమును రచించిన గోనబుద్ధరాజు