పుట:Andhrula Charitramu Part 2.pdf/376

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

(బుద్దారెడ్డి) కుమారుడు కాడని తొచుచున్నది. అతనిదాయాదియె యుండవలయును.

ప్రతాపరుద్రుడు త్రిపురాంతకాంబదేవుల జయించుట.

    కాకతిరుద్రమదేవి మరణానంతరము ములికినాటిసీమలోనే నల్లూరు పట్టణము రాజధానిక ములికినాటిని బరిపాలించుచున్న త్రిపురాంతక దేవ మహారాజును గండికోటదుర్గము రాజధానిగ గండికోటసీమ మొదలగు ప్రదేశములను బరిపాలించుచున్న యంబయదేవంహారాజును స్వామిద్రోహులై సాంరాజ్యాధికారమును ధిక్కరించి స్వతంత్రులైవర్తింప, వారలను శిక్షింప, బ్రతాఅరుద్రుడు తనసైన్యాధిపతులలో గజసాహిణి గుండయనాయనిం గారిని, గజసాహిణి మారానాఅనింగారిని బంపించెను. వీరలు త్రిపురాంతకాంబదెవులను జయించి సామ్రాజ్యాధికారమును దిరుగ నెలకొల్పి స్వాముద్రోహరగండ, స్వామివాచకరగండ, ఇమ్మడినిశ్శకనీరి, పరమమాహేశ్వర సమయాక్రవర్తి, కలియుగవీరభద్ర, కీర్తిసముద్ర, జమలికభోగలింగ, మొదలుగాగల బిరుదముల నెన్నింటినో పడసిరి. ప్రతాపరుద్రచక్రవర్తి సకలసేనాపధిపతి మహారాయపట్ట సాహిణి సోమయనాయనింగారిని గండికోటసీమకు బరిపాలకునిగ నియమించెను. ఇందులకు నిదర్శనములు త్రిపురాంతకంబదేవులు తమగురువు పుష్పగిరిమఠాథిపతి యైన ఆఘోరశినాచార్యులు మొదలగువారికి జేసిన దానశాసనములు క్రీ.శ.1304 గవ సంవత్సరమువఱకు గానంబడుచున్నవి.  తరువాత మహారాయపట్ట సాహిణి సోమయనాయనింగారు పరిపాలించు చున్నందులకు వారికాలమున నాగరాజు అయ్యపరాజు కొడుకులు బయ్యన, చిన్నయ అనువారలు శుల్కాధిరారులుగ నుండి మార్గశుల్కములను గైకొనుచుండి యాసుంకమునుండే తలకంటిదేవికి ఆఖంఏడదీపారాధనకై నెల 1 కి 2 రూకలు ధారాపూర్వకముగ దత్తము గావించి