పుట:Andhrula Charitramu Part 2.pdf/374

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అయోధ్యాకాందమును రచించిన కుమారరుద్రదేవుడు తనభాగమును సాహిణిమారుని కంకితము చేసినది వస్వవ మనుటకు సందియము లేదు. కాని యతడు భాస్కరుని శిష్యుడను మాట విశ్వసింపదగినదిగా గనుపట్టదు. ఇతడు సాహిణిమారుని శిష్యు డను మాట విశ్వసింపదగినదిగా గనుపట్టదు. ఇతడు సాహిణిమారుని తల్లిదండ్రుల నామములను దెలిపియున్నాడు. "ఇది సకలకలా విశారద శారదాముఖ ముకు రామాయణ సారస్వతభట్టబాణ నిశ్శంక వీరమారయకుమార కుమారరుద్రదేదేవ ప్రణీతం" బని గద్యములో వ్రాసికొని యుండుటచేత నితడు సాహిణిమారుని కుమారు డని నిశ్చయించుచున్నారు. ఇట్టి అభినవభట్టబాణ బిరుదాంకితుడు సకలకలావిశారదుడు భాస్కరుని శిష్యుడై భస్కరుని యాజ్ఞప్రకారము దీనిని రచించి యున్నయెడల తనగురువును బేర్కొనక యిట్టిబిరుదములు ద్చెప్పుకొని గురుధికారమును గావించునా? ఇంత విద్యావందుడైన కుమారుడు గలిగియుండియు సాహిణిమారు డీరామాయణము నంతయు నీతనిచేతనే వ్రాయింపకుండుటకు గారణంబేమి? అరణ్యకాండము సాహిణిమారుని కంకితము ఛెయబడియున్నది. గాని రచనావిధాన మంతయు నన్నెచోడ తిక్కనాది కవివరుల రచనావిధానక్రమమును బోలియున్నది. ఈకాండమున నాశ్వాస విభాగము చేయబడినది. అంతియు గాక యీకాండమునందలి ప్రధమ ద్వితీయాశ్వాసాంత పద్యములు కృతిపతిని గూర్చిన సంబోధనములు గాక ప్రధమద్వితీయాంతములుగా నున్నవి. ఇట్టి మార్గమును తదితర కాండములను రచించిన కవు లెవ్వరు నఫ్వలంబించి యుండలేదు. ఈకాండముయొక్క గద్యములో "ఇరి సకలసుకవిజనవిను; యశస్కర బాస్కర ప్రణీతం" బని యున్నది. ఈబాస్కరమహాకవియొక్క ప్రతిభావిశేషము వేఱుగ గద్యములొ జెప్పుకొన నక్కఱలేకయ యారణ్యకాండ రద్చనమే వేనూలళ్ల జాటుచున్నది. యుధ్దకాండముతదను:-