పుట:Andhrula Charitramu Part 2.pdf/369

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

"సీ. కాకతిక్ష్మాపాల గంధ దంతావళి
          ధ్వజినీమహీధరంధరు డనంగ
      నవలక్ష కోదండనాధృరాజ్యాంబోధి
          సద్వర్ణపూర్ణీమా చంద్రు డనంగ
     నాంధ్రభూమండలాధ్యక్షసింహాసన
         సంప్రతిష్ఠాపనాచార్యు డనంగ
    వీరరుద్రాసేషవిశ్వంభరాధీశ
          పృధుల దక్షిణభుజా పీఠ మనంగ
గీ. యవనసంహారవిలయకాలాగ్ని యనంగ
       ధాటి నిఘటిత కుమ్మరో డ్యాను డనగ
   విశ్వలోక ప్రశస్తుడై వినుతి కెక్కె
      సతుల బలలీల పోలయయన్న శౌరి."

  ఈతడుఇ ప్రతాపరుద్రుని గజఘటసేనల కధ్యక్షు డనియు, నవలక్షధను ర్ధదులు గల రాజ్యాధిపతి సేనాసముద్రమునకు జంద్రునివంటి వాడనియు, ఆంధ్ర భూమండలాధ్యక్ష సింహసనప్రతిష్ఠాపకుండనియు, వీరరుద్రమహారాజు యొక్క సమస్తరాజ్యభారధురంధరు డనియు, యవనుల (తురుష్కుల) సమహరించుట లో గాలాగ్నిరుద్రకల్పుడనియు, కుమ్మట యను ప్రదేశమును జయించె ననియు, పైపద్యమున జెప్పబడియుండెను.  మఱియు నితనికి కొలని ప్రతాపరుద్రుడు విభాకరగ్రహణకాలమున నొకయగ్రహారమును దానము చేసె నని పైభీమఖండము లోని యీక్రింది పద్యములో జెప్పబదియున్నది.

"చ. కొలని ప్రతాప రుద్రనృపకుంజరుచేత నరెందుసారణీ
      సలిలవివర్ధమాన బహుసస్యమాకుల మగ్రహారమై
      వెలల విభాకరగ్రహణవేళ దగంగ బరిగ్రహించి బం
     ధుల భరియించె నన్నవిభుతో సరి యెట్లు ప్రధాను లెవ్వరున్.