పుట:Andhrula Charitramu Part 2.pdf/370

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఈ యన్నమంత్రి అరమమా హేశ్వరాచారతత్పరుం డైన నియోగి బ్రాహ్మణుడు. ఇతని దానశాసనమ్లు కృష్ణామండలములోని శ్రీకాకుళమునంగలవు.

సాహిణిమారుడు-భాస్కరరామాయణము.

   భాస్కరరామాయణకృతికి బతి యైన సాహిణీమారుడు (మారయ సాహిణి) ప్రతాఅరుద్రుని యశ్వసైన్యంబున కధ్యక్షుడుగ నుండెను. అయోధ్యాకాండారి పద్యములో "బుద్దయ కుమారసాహిణి మారా" అనియు, కాండాంతాద్యములో "కారమాంబా కుమారా" యని కుమార రుద్రదేవుడు సంబోధించి యుండుటచేత సాహిణిమారుడు బుద్ధాకును కాచమాంబకును జనించె నని స్పష్ట మగుచున్నది. ఈబుద్ధయ రంగనాధరామాయణమును రచించెన గోనబుద్ధారెడ్డి యని కవులచరిత్రము దెలుపుచున్నది.  "కోనకాట భూపతికుమారుడు రుద్రరాజు; రుద్రరాజు కుమారుడు బుద్ధరాజు; బుద్ధరాజు కుమారుడు ఇష్ఠలరాజు; నిస్ఠలరాజు కుమారుడ్యు బుద్ధరాజు; బుద్ధరాజు కుమారుడు మారయ" అని కవులచరిత్రము లో వంశక్రమము చెప్పబడినది కాని యిది యెక్కడనుండి గైకొనబదినదో దెలియరాదు."రంగనాధరామాయణము బుద్ధరాజు రచియించిన ట్లుండుటచేతను, భాస్కరరామాయణమరాజు పుత్రుడైన మారవి కంకితము చేయబడుటచేతను సాహిణిమారుడా బుద్ధరాజు కొడుకే యైన పక్షమున" అని సందేహించి వ్రాయుట చేత పైని జెప్పిన వంశక్రమము సరి యైంది కాదని మన మూహింపవచ్చును. రంగనాధరామాయణమును రచించిన గొనబుద్దారెడ్డికుమారుడు మారయ యని యనెకులు నిశ్శంకముగా జెప్పియున్నారు.  సాహిణిమారునితండ్రి గోనబుద్ధారెడ్డి క్రీ.శ. 1277 లో నుండెను.  బూదుపూరి శాసనములో "శ్రీగోనవంశనిజశేఖర బుద్దయామాఖ్య పుత్రీ పవిత్రచరితా ధరితగణౌఘై:" అనియు, "శాకాబ్దే వసునందశంకరమతే శ్రీ ధాతృసంవత్సరే అనియు నున్నవి" అని ప్ర