పుట:Andhrula Charitramu Part 2.pdf/368

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

"క. ఘను డిందులూరి యన్నయ
     జనకాగ్రెమ పుత్త్రుడమల చారిత్రుం డిం
     పునం గొలని రుద్రదేవుని
     యనుపమగుణముల నుతింప నక్కజము మహిన్.
 గే. అనఘచరితుడు కొలని రుద్రావనీశు
     డఖిల జనులును వినుతింప నమలమహిమ
     జెలగి యేకశిలాపుర సింహసధర
     పరిమితాంతరభూభాగభరము దాల్చె
క. అనుపమ చరితుం డగు రు
     ద్రనరేండ్రు కరాలవారిడారల చేతన్
      దినియని భూపతి సుతులును
      తనియని ధరణీసురులును ధరణిం గలరే."

కొలను ప్రతాపరుద్రుడందురు. కొల ననునది కృష్ణామండలములోని యేలూరు పట్టణమునకు నామాంతరము. ఈత డాపట్టణమును నివాసస్థలముగా జేసి కొని యుండుటచేతను గాబోలును నీతనికి కొలను ప్రతాపరుదుడని ప్రసిద్ధి గలిగెను!

బెండపూడి అన్నామాత్యుడు

   కాశ్యాగొత్ర జాతుడైన పోల యామాత్యునకు ద్వితీయపుత్రుడైన అన్నయ మంత్రి శ్రీవీరప్రతాపరుద్రచక్రవర్తియొక్క రాజ్యభారధురంధరులలో నొక్కడుగా నుండెను.  శ్రీనాధమహాకవి తనభీమఖండమును ఈయన్న మంత్రిమనుమ డును  అల్లయవీరభద్రారెడ్డిమంత్రియు నగు అన్నమంత్రికి నంకితము సేయుచు పీఠికలో నీయన్నామంత్రి నీక్రిందిపద్యములో నీవిధముగా నభినతించియున్నాడు.