పుట:Andhrula Charitramu Part 2.pdf/360

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

బడినది. కాబట్టి పైశాసనములో బేర్కొనంబడిన యన్నలరాజును స్థానిక చరిత్రములం జెప్పబడిన యన్నమదేవర భూపాలుడును భిన్నులుగాక యొక్క రే యనియు, ఆయన, రెండవప్రతాపరుద్రచక్రవర్తికి బినతల్లియగు రుయ్యంబ పెనిమిటి యగు ఇందులూరి యన్నమదేవ భూపాలు డనియు విశ్వసింపవచ్చును. ఇతనికి సంతానము లేనందున నితనియనుమతి గైకొనియే రుద్రమ దేవి తన పెద్ద కొమార్త పుత్రుడగు శ్రీ వీరప్రతాపరుద్రదేవునకు బట్టము గట్టెను.

     చెన్నపురి ప్రాచ్య లిఖిత పుస్తకభాండాగారములో వెలుగోటివారి వంశచరిత్రం  బను పేరుతో నున్న యొకపుస్తకములో గణపతిదేవునకు పుత్త్రసంతతి లేక రుద్రాంఇమ యని కొమార్త యుండె ననియు, గణపతికి బిమ్మట రెచెర్ల ప్రసాదాదిత్యుం డామై పురుషుండని ప్రకటించి సింహాసనంబునం గూరుచుండబెట్టి రాజ్యంబులును దానే నిర్వహించుచు నామె కొకకన్యకను దెచ్చి పెండ్లి చేసె ననియు, ఆకన్యక కాపురమూకు వచ్చిన తరువాత, తనభర్త ను స్త్రీనిగా నెఱింగి విషణ్ణహృతయయై యుండునంట నీ ప్రసాదాదిత్యుండు తెలిసికొని యొక మహాపురుషుని యనుగ్రహమున నారామతిలకము పుత్త్ర రత్నమును గాంచు నట్లుగా జేసి రుద్రదెవిని జంపి యాచిన్నదానిని రాజ్యాధిపతిని గావించె నని యున్నది.  ఇది అవిశ్వసనీయమైనట్టి కధగా నున్నది.

రుద్రమదేవి పరిపాలనము

   ఇంకను రుద్రమదేవి పరిపాలనమున దాదిసోమయసాహిణి మొదలగు ప్రసిద్ధులైన సైన్యాధిపతు లెందరో గలరు గాని వారల చరిత్రము వివరముగా దెలియరాదు.  ఈమె ఇట్టి యవక్రపరాక్రమవంతు లయిన శూరవరుల సాహాయ్యముతో శత్రురాజులను ప్రతిపక్షుల నోడింఛి చిరకాలము నిష్కంటముగా నాంధ్రసామ్రాజ్యమును బరిపాలనము చేసి తనయశస్సును లోకమున