పుట:Andhrula Charitramu Part 2.pdf/359

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అన్నమదేవ భూపాలుడు

   రుద్రమదేవి రెండవాల్లుడైన అన్నమదేవభూపాలుడు అనుమకొండకు దూర్పున సింహాచలమువఱకు నుండుదేశమును తనయన్నగు కొలని రుద్రనాయని సాహాయ్యముతో జయించి రుద్రదేవికి దక్షిణభుజమై యెప్పుచుండి నవాడు. ఇతడు సూర్యవంశజుడని చెప్పంబడియెను. ఇతర పూర్వులగుమైలము బీమన, మొదలగువారు ధరిణికోట, కొలిపాక, కేతవరము. విజయవాడ మొదలగు ప్రదేశములం బరిపాలనము చేసి ప్రతిష్ఠగాంచినారు. వారిశాసనములు గణపతిచక్రవర్తి కాలమునాటి వఱకు  కొలిపాక, కేతవరము, ధరణికొట మొదలగు ప్రదేశములు గానంబడుచున్నవి.  మఱియు నాకుటుంబము వారియొక్క శాసనము ఇప్పటినుండి క్రీ.శ.1518 వఱకు విజయవాటిక యందు గానంబడుచున్నవి. శా.శ.1440 దవ సంవత్సరములో విజయవాటికయందు లిఖియింపబడిన యొక శాసనములో నొక అన్నలరాజు పేర్కొనంబడియెను. అం దతడు గొదావరికి వంతెన తట్టించెనని చెప్పబడినది. ఆబాగ మీ క్రింది నుదాహరించుచున్నాడను.

       "ఆసీ త్కండమరాజేంద్ర స్సాసీ రిపువిజిత్వర: ।
        ఆసీ స్మరణ స్ఛక్రశాసీ తస్య తయాభవ: ।
        ఆసీ దన్నలదేవేంద్రో దాసీకృతధరాప్;అతి:।
        భాగీరధీసాధోధే స్సాగీతచరిల్తాం లుధై: ।
        ఆర్యా నృపస్యత స్యాసీ ద్భార్యా కేశవనామకా ।
       యాతుం యశాంసి యోజంతో: పాతుం చాందసి మజ్జత: ।
       సేతుం జలంధ గోరాయా యా తుంగజలవీచికా । "

  అన్నమదేవ భూపాలుడు రాజమఃహేంద్రవర ప్రాంతప్రదేశామును ముప్పది సంవత్సరములు పరిపాలనము చేసెనని స్థానికచరిత్రములందు జెప్ప