పుట:Andhrula Charitramu Part 2.pdf/358

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

రుద్రుని అభిషిక్తుని గావించి యుండును. అట్లు జరుగక రుద్రమదేవి పరిపాలనము సేయుట సంభవింపదు. ప్రతాపరుద్రుడు క్రీ.శ.1323 వఱకు బరిపాలనము చేసియుండెను గనుక నెనుబది సంవత్సరములు జీవించి యున్న వాడని చెప్పవలసివచ్చును విద్యానాధ మహాకవికృతమైన ప్రతాపరుద్ర యశోభూషణ మన్ నలంకారశాస్త్రగ్రంధమునందు రుద్రమదేవి రాజ్యపరిపాలము చేసినట్లు స్పష్టముగా జెప్పబడియున్నందునను "మార్కోపోలో" అను వెనీసు వర్తకు డామెపరిపాలనమును శ్లాఘించి నలువరి సంవత్సరముల నుండి పరిపాకనము సేయుదున్నదని చెప్పియున్నందునను రుద్రమదేవిని పరిపాలనము చేసిన దను మాట నిరాకరింపదగినది కాదు. కాబట్టి భావిపరి శోధనములవల బ్రతాపరుద్రు డెప్పుడు జనించెనో ఎప్పుడు పట్టాభిషిక్తుడయ్యెనో తెలియు పర్యంత్రము రుద్రమదేవి క్రీ.శ.1295 వఱకు బరిపాలనము చేసి తరువాత రాజ్యభారమును మనుమనిపై బెట్టెనని యూహింతము. మనమ డయిన ప్రతాపరుద్రుని రుద్రమదేవి కుమారునిగా బెంచుకొన్నట్టు గానిపించు చున్నది. ఏశాసనమునందు రుద్రమదేవి గభపతికూతు రని చెప్పబడినతొ ఆశాసనములను రుద్రమదేవికి రుద్రదేఫుడను కుమారుడు గల డని యీ క్రింది శ్లోకములో జెప్పబదినది.

"శ్రీవిశ్వేశ్వరదేశికేంద్రశివహాస్తోద్భాసిదోర్విక్రమ
  స్త్రీక్షోణీశజత్గద్దశ:ప్రతిబలప్రధ్వంసిజన్మోత్సవ,
  యస్యా: కాకతివంశమాక్తికమణి: శ్రీరుద్రదేవ స్పుత
  స్తస్యా: కం కధయామ వైభవ మత: శ్రీరుద్రదేవ్యా: పురం"

  శ్రీరుద్రదేవి తన మనుమనికి వయస్సు వచ్చినదని తెలిసికొన్న తరువతనే రాజ్యభారము మొప్పగించె నని ప్రతాపరుద్రయశోభూషనయందు జెప్పబడినది.