పుట:Andhrula Charitramu Part 2.pdf/345

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ప్రోలరాజునకు గణపతి యనునామాంతర మొండు గలదని యెక్కడను చెప్ప బడియుండలెదు. ఎశాసనములోని నామమే సందిగ్ధముగా ఉన్నది. కనుక గణఫతిరుద్రుండనగా గణపతియనియె భావించుకొనబవలసిన పక్షమున నందలి సంవత్సరము తప్పని స్పష్టముగా జెప్పవచ్చును. ఇంతసంధిగ్ధముగా నున్న యీశాసనము నాధారపఱచుకొని కాకతిగణపతిదేవ చక్రవర్తి పుత్రికయైన రుద్రాంబ భర్త చాళుక్య మల్ల విష్నువర్ధనుడని యూహించుట యొప్పిదముగా గనుపట్టదు. భావిపరిశోల్ధనమువలన నింతకన్నను ప్రబల సాక్ష్యము గాన్పించువఱకు రుద్రాంబికభర్త యితడే యని నిర్దారించుట ప్రమాధహేతువు వగును. అంతవఱకు రుద్రాంబికభర్త యితడే యని పేరుపెట్టక యితడొక మండలేశ్వరుడనియు, రాజబంధువులలోనివాడై యిల్లఱిక ముండె ననియు యానవవల్యస్కుడైయున్న కాలముననే మృతిం జెంది యుండు ననియు విశ్వ సించి యట్లువ్రాసినందువలన ప్రమాద మెద్దియు నుండబోదు. ఈమె రాజ్య భారము వహించుటకుకు బూర్వమె, 'ఉమ్మక్క, రుయ్యమ్మ ' అను నిరువురు పుత్రికలను గనెనని తెలియుచున్నది.

రుద్రాంబిక మహాదేవరాజును జయించుట.

   గణపతి చక్రవర్తి యవసానకాలమున జెప్పినరీతిగా చినదేవయ మొదలుగా గలమంత్రివర్గమును, జన్నిగదేవ మహారాజు మొదలుగా గల సేనాధిపతులను, ప్రసాదాదిత్యనాయుడు మొదలుగా గల భృత్యూవర్గమును ధైర్యసాహసములను జూపి రుద్రదేవిని పట్టాభిషిక్తురాలినిగ జేయుట వీరవరుడయిన మాండలిక రాజులలో గొందఱకు నవమానకరముగ గన్పట్టెను. ఆంధ్రసామ్రాజ్య పీఠము నధిష్ఠించిన యొక్క యాడుదాని పాదపద్మములకు మ్రొక్కుట వీరపురు షాగ్ర గణ్యులకు దలవంపులుగ గన్పట్టెను. ఇట్లు మాండలిక రాజులు గొందఱు చక్రవర్తిని యెడగలఃభయముచే మిన్నకుండినను రాజద్రోహులై దేవగిరి ప్రభువు లయిన యాదవులతోడ గుట్రలుచేసి తుదకు యాదవులు దండెత్తి వచ్చునటుల జేసిరి. ఇక్కడ యోరుగంటిలో